సినిమాల కోసం కొంతమంది నటీనటులు ఎంతటి రిస్క్ చేయడానికైనా సిద్ధపడతారు. ప్రేక్షకులకు వినోదం పంచడానికి తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెడుతుంటారు.
Advertisement
అలా టాలీవుడ్ లో కొంతమంది నటీనటులు అప్పటివరకు గుర్రపు స్వారీలో ఎలాంటి అనుభవం లేనప్పటికీ చాలా రిస్క్ చేసి మరీ గుర్రపు స్వారీ నేర్చుకుని సినిమాల్లో నటించారు. ఆ నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
నందమూరి బాలకృష్ణ తన అభిమానుల కోసం ఎంతటి రిస్క్ చేయడానికి అయినా వెనకడుగు వేయరు. బాలయ్య ఎలాంటి స్టంట్ ను అయినా చేస్తారని ఆయనతో నటించిన నటీనటులు చెబుతుంటారు. ఇక గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం బాలయ్య మొదటిసారి గుర్రపు స్వారీని నేర్చుకున్నారు.
అల్లు అర్జున్ రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం రెండు నెలల పాటు గుర్రపు స్వారీని నేర్చుకున్నారు బన్నీ. అంతేకాకుండా అనుష్కకు కూడా గుర్రాలు అంటే చాలా భయం కానీ రుద్రమదేవి సినిమా కోసం చాలా కష్టపడి గుర్రపు స్వారీ నేర్చుకున్నారు.
Advertisement
మహేష్ బాబు కెరీర్ ప్రారంభంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన రెండు వారల పాటు గుర్రపు స్వారీ నేర్చుకుని సినిమాలో హార్స్ రైడింగ్ తో అదరగొట్టారు.
బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ ఆ సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. గుర్రపు స్వారీ తో పాటూ ఈ సినిమా కోసం ప్రభాస్ కత్తి సామాను సైతం నేర్చుకున్నారు.
మగధీర సినిమాలో రామ్ చరణ్ గుర్రం నడిపే స్టైల్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సినిమాలో రామ్ చరణ్ గుర్రం పై వచ్చే సీన్లు ప్రేక్షకులకు తెగనచ్చాయి. ఈ సినిమా కోసం మొదటిసారి చరణ్ గుర్రపు స్వారీ నేర్చుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగ సినిమా కోసం మొదటిసారి గుర్రపు స్వారీని నేర్చుకున్నారు. గుర్రపు స్వారీలో ట్రైనింగ్ తీసుకున్న చిరంజీవి సినిమాలో తన పర్ఫామెన్స్ తో అదరగొట్టారు.
మిల్కీ బ్యూటీ తమన్నా సైతం బాహుబలి సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. సినిమాలో అవంతిక పాత్ర కోసం తమన్నా గుర్రపు స్వారీతో పాటు కత్తి సాము నేర్చుకున్నారు.