నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు న్యూలాండ్స్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
ప్రకాశం జిల్లా కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామికి కరోనా పాజిటివ్ వచ్చింది. తనతో పాటు ఉండే వ్యక్తులకు కరోనా సోకడంతో అనుమానంతో ఎమ్మెల్యే కరోనా టెస్ట్ చేయించుకున్నారు. కాగా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు శ్రీశైలంలో ఈరోజు నుండి 7 రోజుల పాటు హోమాలు చేస్తున్నారు. మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం,ఆయుష్య హోమం, శీతలాదేవి హోమం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరాన్ని చలి వణికిస్తోంది. 15.8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దాంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కరోనా నేపథ్యం లో తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.
Advertisement
లతా మంగేష్కర్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు లతా మంగేష్కర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె కొలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.33 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ వెల్లడించింది. దక్షిణ భారత్ నుండి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వాటి ప్రభావం తో వర్షాలు కురిసే అవకాముందని వాతావరణ శాఖ తెలిపింది.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గాంధీజీ కి ఇష్టమైన అబిడ్ విత్ మీ అనే కీర్తన ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్లేస్ లో సరే సారే జహాన్ సే అచ్ఛా కీర్తన ప్లే చేస్తారు.
తెలంగాణ లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ కోచింగ్ ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.