దేశంలో కరోనా కేసులు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,47,417 కేసులు నమోదయ్యాయి.
Advertisement
సౌర విద్యుత్ లో ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. సౌర విద్యుత్ వినియోగంలో రాజస్థాన్ ఒకటో స్థానంలో ఉండగా కర్ణాటక రెండో స్థానంలో ఉన్నాయి.
టిఎంసి అధినేత మమతా బెనర్జీ గోవాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీఎంసీ తరఫున గోవా ఎన్నికల బరిలో అభ్యర్థులను దింపుతున్నారు. ఫలేరో, అలెక్సో, రెజినాల్డో, అలేమావో అలాంటి అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ వెల్లడించారు.
Advertisement
అమెరికాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే అగ్రరాజ్యంలో ఎనిమిది లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం మొత్తం ప్రపంచ దేశాల్లో కలిపి 30 లక్షల కేసులు నమోదయ్యాయి.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో యోగి గోరక్ పూర్ నుండి పోటీ చేసి పలుమార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఎన్నికై సీఎం అయ్యారు.
ప్రధాని మోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశం లో కరోనా కేసులు ఒక్కరోజులో రెండు లక్షలకు పైగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని పలు సూచనలు చేయనున్నారు.
సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ జేబీఎస్ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్లలో రద్దీ ఏర్పడింది.
నేడు తిరుమల శ్రీవారినిఎస్ వి రమణ దర్శించుకున్నారు.
టాప్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మరియు అశ్విని పొన్నప్ప లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఇప్పటికే పలువురు సినీ, క్రీడాకారులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.