దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రతిరోజు 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్‌తో కొత్తగా 3,06,064 కరోనా కేసులు నమోదయ్యాయి. 439 మంది కరోనాతో మరణించారు.
కరోనా కేసుల నేపథ్యంలో నేడు 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్- లింగపల్లి మధ్య 18 ఎంఎంటీఎస్ సర్వీసులు, ఫలక్‌నామా-లింగంపల్లి మధ్య 16 ఎంఎంటీఎస్ సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
Advertisement
నేడు నాలుగోరోజు తెలంగాణలో ఫీవర్ సర్వే జరుగుతోంది. మూడు రోజుల్లో 42.30 లక్షల ఇళ్లల్లో సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు 1.78 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు.
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మరో మూడు రోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావారణ శాఖ వెల్లడించింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం ఎమ్మెల్యే హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. మూడురోజులుగా తనను కలిసిన వారంతా పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే దానం సూచించారు.
Advertisement
కడప జిల్లాలో బ్రిటిష్ కాలంనాటి రిజర్వాయర్ బయటపడింది. బుగ్గవంక సీమీపంలో బుగ్గ అగ్రహారంలో రిజర్వాయర్ ను గుర్తించారు. 1890 రిజర్వాయర్ ను ఏర్పాటు చేసినట్టు శిలాఫలకం పై రాసి ఉంది.
ప్రముఖ జోతిష్యపండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లో ఆయన ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.
ప్రముఖ వ్యాపారవేత్త కార్వీ చైర్మెన్ పార్థసారథిని బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తులకోసం ఓ ఇంజనీరింగ్ అధికారి తన భార్యకు యాసిడ్ తాగించాడు. బాధితురాలు ఇంటినుండి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది.
వైసీపీలో కరోనా కలకలం రేగుతోంది. తాజాగా మరో ఇద్దరు ఎంపీలకు పాజిటివ్ వచ్చింది. ఎంపీ మాగాని భరత్, వంగా గీతలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.