జీవితంలో అన్నింటికంటే వివాహం ఘనమైనది అని చెబుతుంటారు. అంటే పెళ్లి గొప్పదనం అర్థం చేసుకోవచ్చు..పెళ్లికి ముందు ఇద్దరు తమ జీవితాలు ఎలా ఉండాలో కలలు కంటారు. వారు కలలు కనిన విధంగా తమ వైవాహిక జీవితం ఉంటే ఎంతో ఆనందిస్తారు. కానీ అలా లేకుంటే మాత్రం చాలా బాధతో జీవితాన్ని గడుపుతుంటారు. అయితే భార్య భర్తల అనుబంధం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేదానిపై మానసికనిపుణులు కొన్ని విషయాలు చెప్పారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం….
Advertisement
భార్య భర్తలు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. బయట వ్యక్తులు ఏదైనా సాయం చేస్తే కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు. అయితే భార్య భర్త ఒకరికి ఒకరు సాయం చేసుకున్నా కూడా థాంక్స్ చెప్పుకోవాలని దాని ద్వారా బంధం బలపడుతుందని చెబుతున్నారు. విదేశాల్లో భార్య భర్తలు ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకుంటారట.
Advertisement
అలా చెప్పకపోతే అధికారం చెలాయించే గుణం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతే కాకుండా భార్య భర్త ఇద్దరూ సంపాదించినప్పటికీ భర్త మాత్రం భార్య జీతాన్ని తీసుకుని ఆమెకు అందులో కొంత ఇచ్చి పెద్దలా భావిస్తే కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
ఇద్దరూ మన అనుకున్నప్పుడే ఆ కాపురం సజావుగా సాగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చిన్నచిన్న మనస్పర్దలు వచ్చినప్పుడు గ్యాప్ పెరగకుండా చూసుకోవాలట. మనస్పర్దలు పెరగకముందే కూర్చుని మాట్లాడుకుంటే ఆ కాపురాలు నిలబడతాయట. ఒకవేళ భార్య భర్తల మధ్య దూరం మరింత పెరిగితే ఆ కాపురమే కూలిపోయే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.