ఇప్పుడు సినిమా సక్సెస్ ను ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లను బట్టి అంచనా వేస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం సినిమా కలెక్షన్ల కంటే ఆ సినిమా థియేటర్లలో ఎన్ని రోజులు ఆడింది అనేదాన్ని బట్టి సినిమా విజయాన్ని అంచనా వేసేవారు. ఇక అప్పట్లో సినిమాలు థియేటర్లలో వందల నుండి వేల రోజులు కూడా ఆడాయి మరి.
Advertisement
కానీ ఇప్పుడు ఓటీటీలు…. కరోనా ఎఫెక్ట్ తో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. దాంతో సినిమా 50 రోజులు ఆడటమే గొప్పగా భావిస్తున్నారు. ఇక ఒకప్పుడు 500 రోజులకు పైగా ఆడిన తెలుగు చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం…
నటసార్వభౌముడు ఎన్టీ రామారావు ప్రధాన పాత్రలో నటించిన లవకుశ సినిమా అప్పట్లోనే 1111 రోజులు ఆడింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమా పొద్దుటూరు అర్చన థియేటర్ లో ఏకంగా 1005 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది.
Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా కర్నూల్ లోని ఒక థియేటర్ లో 1002 రోజులు ఆడింది.
మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి సినిమా కర్నూల్ లోని ఒక థియేటర్ లో ఏకంగా 1000 రోజులు ఆడింది.
నందమూరి బాలయ్య హీరోగా నటించిన మంగమ్మగారి మనవడు సినిమా అప్పట్లో ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమా కాచిగూడలోని తారక రామ థియేటర్ లో 567 రోజులు ఆడింది.
కమల్ హాసన్ హీరోగా నటించిన ప్రేమకథాచిత్రం మరోచరిత్ర ఒక థియేటర్ లో 556 రోజులు ఆడింది.
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన లవ్ స్టోరీ ప్రేమాభిషేకం ఓ థియేటర్ లో 533 రోజులు ఆడి అప్పట్లోనే రికార్డు క్రియేట్ చేసింది.