డైరెక్ట్ గా సినిమాల్లో అవకాశాలు దొరకడం ఇప్పుడు దాదాపు కష్టమనే చెప్పాలి. అందుకే చాలా మంది నటులు వివిధ ప్లాట్ ఫామ్స్ లో తమను తాము ప్రూవ్ చేసుకొని సినిమా అవకాశాలు ఛేజిక్కించుకుంటున్నారు. ఇప్పుడు స్టార్ హీరోలుగా చెప్పుకుంటున్నా చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ ద్వారానో, టివి సీరియల్స్, టివీ షోస్ ద్వారానో వచ్చినవాళ్లే!
ఇప్పుడు సౌత్ ఇండియా నుండి TVల్లో పనిచేస్తూ సినిమా అవకాశాలు ఛేజిక్కించుకున్న యాక్టర్స్ గురించి చూద్దాం!
Advertisement
1) నయనతార :
నయనతార మొదటగా కేరళకు చెందిన కైరాలీ TV లో హెల్త్ కార్యక్రమానికి యాంకర్ గా చేసింది. తర్వాత మనస్సినకారే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
2) ప్రకాశ్ రాజ్ :
కన్నడ, తమిళ్ దూరదర్శన్ ఛానల్ లో పలు సీరియల్స్ లో నటించిన ప్రకాశ్ రాజ్ కు ఆ తర్వాత కన్నడలో సపోర్టింగ్ రోల్స్ ఆఫర్స్ వచ్చాయి.
3) హన్సిక :
తమిళ్ , తెలుగుల్లో ఒక ఊపు ఊపిన ఈ యాక్టర్ షకలక బూమ్ బూమ్, కరిష్మాకా కరిష్మా అనే కిడ్స్ షోస్ ద్వారా పాపులర్ అయ్యింది.
4) యష్:
KGF తో పాన్ ఇండియా స్టార్ అయిన యష్ కెరీర్ ఈటివి కన్నడలో వచ్చిన నంద గోకుల అనే సీరియల్ తో స్టార్ట్ అయ్యింది. అటు తర్వాత మాలేబిల్లు ముక్తా సీరియల్ తో మంచి పేరు వచ్చింది అదే సినిమాలో ఛాన్స్ కు కారణమైంది.
Advertisement
5)మాధవన్ :
మరో అరవింద్ స్వామి అంటూ కీర్తించబడిన మాధవన్ మొదట బనేంగీ అప్నీ బాత్, ఘర్ జమాయీ లాంటి సీరియల్స్ లో నటించాడు.
6) సాయి పల్లవి :
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సాయిపల్లవి ఒకప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది.
7) విజయ్ సేతుపతి :
యాక్టింగ్ ఐకాన్ గా పిలుచుకునే సేతుపతి మొదట తమిళ్ సన్ టివిలో పెన్ అనే సీరియల్ లో, కలైంగ్నర్ టివి లో వచ్చిన నలయా ఇయాకునార్ అనే షోలో చేసినవాడే.
8) శివ కార్తికేయన్ :
స్టాండ్ అప్ కమెడియన్ గా స్టార్ విజయ్ ఛానల్ లో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన శివ అనతి కాలంలోనే మంచి యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు.
9) సుడిగాలి సుధీర్ :
తెలుగు టివి రంగంలో రారాజు సుడిగాలి సుధీర్. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సుధీర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఇంకా సరైన హిట్ తన ఖాతాలో పడలేదు. త్వరలోనే సుధీర్ ఓ స్టార్ హీరోగా ఎదగాలని కోరుకుందాం