Home » ఈ వస్తువులు చేతి నుండి అస్సలు జారిపోకూడదు.. లేదంటే అంతే సంగతులు..!

ఈ వస్తువులు చేతి నుండి అస్సలు జారిపోకూడదు.. లేదంటే అంతే సంగతులు..!

by Sravya
Ad

కొన్ని కొన్ని వస్తువులు అస్సలు మన చేయి జారీ కింద పడిపోకూడదు జ్యోతీష్య నిపుణులు కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది అసలు ఇవి మన చేయి జారీ పడిపోకూడదట. మరి మన చేయి జారకుండా ఉండవలసిన ఏంటి అనే విషయాన్ని చూద్దాం. ఈసారి వీటిని పట్టుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి లేదంటే అనవసరంగా నష్టం కలుగుతుంది. బియ్యాన్ని కేవలం ఆహారంగా మాత్రమే కాకుండా రకరకాలుగా వాడుతూ ఉంటాం పూజల్లో కూడా బియ్యాన్ని వాడుతూ ఉంటాం. ఎప్పుడూ కూడా బియ్యం చేతిలో నుండి జారిపోకూడదు.

Advertisement

ఒకవేళ కనుక బియ్యం కనుక జారిపోయిందంటే ఆ వ్యక్తి చెడ్డ వార్త వింటాడని పండితులు చెప్పడం జరిగింది. అలానే ఒకరి చేతి నుండి పాలు కింద పడిపోవడం కూడా ఆశుభం. పాలు చెయ్యి నుండి జారిపోతే పిల్లల జీవితంలో సమస్యలు వస్తాయి. అదే ఒకవేళ పాలు పొంగిపోయినట్లైతే ఖచ్చితంగా అది శుభమట అలానే జ్యోతిష శాస్త్రం ప్రకారం పంచదార కూడా కింద పడిపోకూడదు పంచదార కూడా చేతుల నుండి జారిపోతే అశుభంగా భావిస్తారు. సనాతన ధర్మంలో పంచదారని భగవంతునికి నైవేద్యంగా పెడతారు. పంచదారని జారిపోవడం అశుభంగా పరిగణిస్తారు.

Advertisement

ఒక వ్యక్తి చేతి నుండి కొబ్బరికాయ పడిపోతే కూడా ఇబ్బందులు వస్తాయంట. ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డం కి వస్తుంది. అలానే ఉప్పు కూడా జారిపోవడం మంచిది కాదు. ఇవి ఎప్పుడూ కూడా జారిపోకుండా చూసుకోండి. ఇవి కనుక చేతి నుండి జారిపోయినట్లయితే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అని గుర్తు పెట్టుకోండి. వీటిని పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోండి అలానే ఎప్పుడు కూడా ఒకటి చేతికి డైరెక్ట్ గా ఉప్పు ఇవ్వకూడదు. కారం కూడా ఇవ్వకూడదు. ఇటువంటి వాటిని ఇవ్వవలసి వస్తే కింద పెట్టి తీసుకోమని చెప్పాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading