జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండాలనే పతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే జీవితంలో వచ్చే కొన్ని సమస్యల వల్ల పార్ట్నర్ తో గొడవలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న గొడవలు జరగటం చాలా కామన్…అప్పుడే రిలేషన్ షిప్ కూడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. కానీ గొడవలు ఎక్కువ అయితే మాత్రం సమస్యలు తప్పవు. ఇక గొడవలు జరగటానికి అబద్దాలు చెప్పడం కూడా ఒక కారణం అని చెబుతుంటారు. కానీ కొన్ని అబద్దాలు చెప్పడం వల్ల వారి రిలేషన్ షిప్ స్ట్రాంగ్ అవుతుందని మానసికనిపుణులు చెబుతున్నారు.
Also Read: Chanakya Niti : ఈ 5లక్షణాలు ఉన్న మహిళలకు పురుషులు తలవంచకుండా ఉండలేరట..!
Advertisement
ఆ అబద్దాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…భార్య తన భర్త కోసం లేదా భర్తలు తన భార్య కోసం వంట చేసి పెడుతుంటారు. ఎంతో కష్టపడివారికి నచ్చాలనే కోరికతో వండిపెడతారు. అయితే అలా వంట చేసినప్పుడు ఒకవేళ అది కుదరకపోయినా కూడా భాగుందని మెచ్చుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అంతే కాకుండా భార్య భార్తలు ఏదైనా సర్ప్రైజ్ చేసినప్పుడు నచ్చకపోయినా చాలా భాగుందని ఈ సర్ప్రైజ్ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పాలట. అలా చెప్పడం వల్ల వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరిలో అయినా లోపం ఉన్నప్పుడు ఇతరుల ముందు ఎగతాలి చేయకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఎగతాలి చేసినప్పుడు కోప్పడితే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా భర్య కానీ భర్త కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వారి నిర్ణయానికి గౌరవం ఇవ్వాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్ణయం మంచిది అయితే ప్రశంసించాలని చెబుతున్నారు.
Also Read: రకుల్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా…అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే మతి పోవాల్సిందే..!