దర్శకుడు అన్నాక తనకంటూ ఒక సొంత క్రియేటివిటీ ఉంటుంది. తన ఆలోచన ధోరణిని బట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. ప్రేక్షకులకు కొన్ని మూవీస్ కనెక్ట్ అయ్యి పెద్ద హిట్ అవుతాయి కొన్ని మాత్రం కనెక్ట్ అవ్వక నచ్చక డిజాస్టర్ లాగా మిగిలిపోతాయి కొంతమంది దర్శకులు ఒక ఫార్మాట్ ని వాడుతూ ఉంటారు.
Advertisement
ఏ సినిమా చేసినా కూడా ఆ ఫార్మాట్ ని వాడుతూ ఉంటారు. కొంతమంది దర్శకులు ఎక్కువగా ఫాలో అయ్యే వాటి గురించి చూద్దాం. కొరటాల శివ గురించి చెప్పుకోవాలంటే ఆయన ఏ సినిమా ప్రొమోషన్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా టక్ చేసుకుని వస్తారు. చూడడానికి ప్రొఫెషనల్ గా కనబడతారు.
లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే అర్ధరాత్రి ఫైట్ సీన్ ఉండి తీరాలి. అటువంటి సీన్ ఉండేటట్టు ఆయన చూసుకుంటారు. హీరో ఎవరైనా సరే ఫార్మేట్ మాత్రం అసలు మారదు.
Advertisement
అట్లీ కుమార్ విషయానికి వస్తే ఈయన ఇంచుమించు విచిత్రమైన స్వభావాన్ని కలిగిన సినిమాలు తీస్తూ ఉంటారు. ఆయన సినిమాలో నటించే ఏదో ఒక మెయిన్ లీడ్ కచ్చితంగా చనిపోతారు. శేఖర్ కమ్ముల కి అయితే ఎలాంటి సీజన్ అయినా పర్లేదు వర్షం మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకుంటారు.
రాజమౌళి అయితే ఆయన సినిమాలో కచ్చితంగా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది అది కూడా లేడీస్ సెంటిమెంట్ తో ఉండడం విశేషం. అందులో నుండి ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటుంది.
బోయపాటి శ్రీను అయితే పిండం పెట్టకుండా అసలు ఊరుకోరు ఎవరికో ఒకరికి పిండం పెడతారు. అదే మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయన సినిమాలో కచ్చితంగా రెండవ హీరోయిన్ ఉంటుంది.
ఆమె హీరోయిన్ కంటే పవర్ ఫుల్ గా ఉండి ఉంటుంది. తరుణ్ భాస్కర్ ఏదో భయంకరమైన సీన్ పెడతారు. ప్రశాంత్ నీల్ దుమ్ము దులితో నింపుతాడు ఇలా వీళ్లంతా కూడా కొన్ని ఫార్మాట్లని పక్కా ఉండేటట్టు చూసుకుంటారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!