నందమూరి బాలకృష్ణ హోస్టుగా అదరగొడుతున్న “అన్ స్టాపబుల్” రెండో సీజన్ ఫినాలే కు స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. మిగతా వాటికంటే దీన్ని బాప్ కా ఎపిసోడ్ అంటూ ఆహా టీం ప్రచారం చేసింది. దీనితో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే పవన్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రెండో పార్ట్ కు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఫిబ్రవరి 9న రెండో పార్ట్ ను విడుదల చేశారు. ఈ తరుణంలోనే పవన్ దగ్గర నుంచి బాలయ్య ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రాబట్టారు.
Advertisement
Advertisement
సినీ రాజకీయ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై సైతం ప్రశ్నలు సంధిస్తూ ఎపిసోడ్ ను రక్తి కట్టించారు. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవిలో తనకు నచ్చిన మరియు నచ్చని విషయాల గురించి వివరించాడు. అసలేం జరిగిందంటే, షోలో భాగంగా బాలయ్య, ‘నాకు మా నాన్న గారు దైవం, ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. అలా నీకు మీ అన్నయ్యగారు దైవం, ఆయన నుండి నువ్వు నేర్చుకున్నది ఏమిటి’ వదిలేసింది ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు పవన్ కళ్యాణ్ బదులిస్తూ చిన్నతనం నుండి మా అన్నయ్య దగ్గర నుండి నేర్చుకున్నది కష్టపడే తత్వం.
అలాగే కుటుంబం మొత్తం ఎలా కలిసి ఉండాలి అనేది కూడా ఆయననుండే నేర్చుకున్నాను. ఇక అన్నయ్య లో నాకు అస్సలు నచ్చనిది మొహమాటం. అది రాజకీయాలకు పనికిరాదు. కాబట్టి నేను దానికి దూరంగా ఉంటాను. అలాగే అన్నయ్య అతి మంచితనం కూడా నాకు నచ్చదు. దానివల్ల ఆయన చాలా నష్టాలను చూడాల్సి వచ్చింది అంటూ చెప్పుకోచ్చారు. మొత్తానికి చిరంజీవిలో మొహమాటం అతి మంచితనం తనకు నచ్చనే నచ్చవని పవన్ బాలయ్య షో వేదికగా తేల్చేశాడు.
READ ALSO : రాజకీయాలకు గుడ్ బై..సినిమాల్లోకి ఏపీ మంత్రి విడదల రజిని?