మన భారతదేశంలో అనేక రకాల సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి. కాలం ఎంత అభివృద్ధి చెందుతున్నా కానీ మన సంప్రదాయాలను మాత్రం ప్రతీ ఒక్కరు పాటిస్తునే ఉంటారు. ఎంత చదువుకున్నా ఎంత ఎత్తుకు ఎదిగినా..? వాటిని మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టరు. అనాది కాలంగా వస్తున్న కొన్ని ఆచారాలను మాత్రం ఇంకా ఆయా జాతుల్లోనే పాటిస్తూనే ఉంటారు. వాస్తవానికి సాంప్రదాయాలు అనేవి ప్రాంతానికి ఒక రకంగా, కొన్ని వర్గానికి ఒకరకంగా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. ఇందులో చెప్పుకోదగ్గవి హిందూ సాంప్రదాయాలు మహిళలు పాటిస్తారు.
Advertisement
భర్త నిండు నూరేండ్లు బతికి ఉండాలని పూజలు, వ్రతాలు కూడా చేయడం చూస్తుంటాం. అయితే భర్త బతికి ఉన్నప్పుడు మహిళల అలంకారం ఒకలా.. భర్త చనిపోయిన తరువాత మరొకలా ఉండడం అందరికీ తెలిసిందే. అయితే భర్త చనిపోతే ఎలాంటి గాజులు, బొట్టు, పూలు పెట్టుకోరు. భర్త మరణించాక వారు వితంతువులుగా మారిపోతారు. కానీ ఒక చోట మాత్రం భర్త బతికి ఉండగానే వితంతువులు అవుతున్నారు. అలా అయితే ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే వారి భర్త ఆయుస్సు కోసమేనట.
Advertisement
ఉత్తరప్రదేశ్ కు చెందిన గచ్వాహా తెగకు చెందిన మహిళలు ఇలాంటి వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. ఆ మహిళలు వారికి పెండ్లి అయిన తరువాత భర్తల ఆయుస్సు బాగా పెరగాలని దాదాపు ఐదు నెలల వరకు వితంతువులుగా జీవిస్తారు అని తెలుస్తోంది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. కానీ ఇది వాస్తవమే. అయితే వీరు ప్రతి సంవత్సరం ఐదు నెలల పాటు మాత్రం ఇలా వింతంతువులుగా జీవిస్తారట. మిగతా రోజుల్లో మాత్రం మామూలుగా ఉంటారని తెలుస్తోంది. ఈ మహిళలు వితంతువులుగా ఉన్న ఐదు నెలల పాటు భర్తలు తమ వృత్తి అయిన కళ్లు తీయడానికి వెళ్లుతుంటారట..!