మోసాలు ఎక్కువ అయ్యిపోతున్నాయి. కొత్త తరహాలో కూడా ఎక్కువగా మోసాలు చేస్తున్నారు. గుంటూరులో కొత్త తరహాలో సెల్ ఫోన్ చోరులు దొంగతనాలు చేస్తున్నారు. ఏదో ఒక చోట ఒకే తరహాలో సెల్ ఫోన్లు చోరి అవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్లున్న ఫోన్లు కి ఇరవై వేల రూపాయల నుండి నలభై వేల రూపాయల ధర ఉండడం తో దొంగలు సెల్ ఫోన్ చోరీలపై ఆసక్తి చూపుతున్నారు. సిసి కెమెరా విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
Advertisement
వివరాలు చూస్తే… వసంత రాయ పురానికి చెందిన ప్రసాద్ ఫోటో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 26 వ తేదిన అమరావతి రోడ్డులో వెళ్తుంటే.. ఒక యువకుడు బైక్ పడిపోతున్నట్లు సాయం చేయాలని అడిగాడు. సహాయం చేసేందుకు వెళ్లగా అదే సమయంలో మరొక యువకుడు కూడా వచ్చి బైక్ పై నుంచి సాయం చేయడానికి వెళ్ళాడు. తర్వాత ప్రసాద్ తన పని మీద వెళ్ళిపోయాడు షాప్ కి. షాపులోకి వెళ్లిన తర్వాత ప్రసాద్ తన జేబులో సెల్ ఫోన్ పోయినట్లు తెలుసుకున్నాడు.
Advertisement
ఫోన్ కొట్టేసినట్లు ప్రసాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. జరిగినది అంతా సీసీ టీవీ లో కనపడింది. మళ్ళీ ఇలానే ప్రసాద్ కి జరిగింది కానీ ఈసారి సాయం చేయడానికి రాలేదు. ప్లాన్ ఫెయిల్ కావడంతో దొంగలు వెళ్లిపోయారు. నగరంలో ప్రతి రోజూ కూడా, ఏదో ఒక చోట ఇటువంటివే జరుగుతూ ఉన్నాయి. దీంతో పోలీసులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. సహాయం అని అడిగి ఫోన్ కొట్టేస్తున్నారు జాగ్రత్తగా వుండండి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!