Home » తల్లిదండ్రులు కాబోతున్న ఇండియన్ “గే” జంట.. ఎలా సాధ్యమంటే?

తల్లిదండ్రులు కాబోతున్న ఇండియన్ “గే” జంట.. ఎలా సాధ్యమంటే?

by Bunty
Ad

మనసు పడితే మనువు ఆడెందుకు జెండర్ అడ్డంకి కాదనే భావనతో స్వలింగ సంపర్క వివాహాలు గత కొద్ది కాలంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మొదలైన ఈ పోకడ మన దేశంలోనూ గత కొద్ది కాలంగా కనిపిస్తోంది. అయితే గతంలో జరిగే ఈ తరహా వివాహాలు ఇప్పుడు బహిర్గతంగా సాగుతున్నాయి. అంతేకాదు ఓ గే జంట ఓ బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమైంది కూడా. ఆ జంటే అమిత్ షా, ఆదిత్య మదిరాజు లది.

Advertisement

2019లో అమెరికా న్యూ జెర్సీ వేదికగా ఒక్కటైన ఈ స్వలింగ సంపర్కులు అప్పట్లో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టించారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రకటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. తామిద్దరం పేరెంట్స్ కాబోతున్నామని అమిత్ షా, ఆదిత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వీళ్లు సహజంగా పేరెంట్స్ కావడం అసాధ్యం. అయితే ఓ మహిళ వీళ్ళకు అండాన్ని దానం చేసింది. దీనితో ఐవిఎఫ్ పద్ధతిలో వీళ్ళు ఓ బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు.

Advertisement

మే నెలలో తాము పేరెంట్స్ కాబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ గే జంట ఆనందం వ్యక్తం చేసింది. అందరిలాగే తమకు కూడా ఓ బిడ్డ ఉంటుందని పేర్కొంది. తమను చూసి ఎంతో మంది స్వలింగ సంపర్కులు ధైర్యం చేసి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు వాళ్లు పిల్లలను కనే మార్గం కూడా ఉందని తాము నిరూపిస్తున్నామని ఆదిత్య వివరించారు. నాలుగు రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు. ఇకపై స్వలింగ సంపర్కులు కూడా పెళ్లి, పిల్లల విషయంపై ఆందోళన చెందకుండా సంతోషంగా అందరిలాగే సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చని ఈ గే జంట చెబుతోంది.

READ ALSO  : సూర్య భీకర సెంచరీ.. రికార్డులన్నీ బద్దలు! టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!

Visitors Are Also Reading