ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. తెలుగు కమర్షియల్ సినిమా గురించి చెప్పాలంటే మొదటి వినపడేది చిరంజీవి పేరే. 150 కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చిరు. స్టైల్ తో డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు చిరంజీవి. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి చాలామంది వచ్చారు. హీరోలు అవ్వాలని చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా మంది వస్తూనే వున్నారు.
Advertisement
నిజానికి చిరంజీవికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కానీ, ఒక్క అలవాటు మాత్రం ఆయనకు శాపంగా మారుతోందని ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఈ వార్తను ఆయన అభిమానులే వైరల్ చేస్తున్నారు. ఆయనకు ఉన్న అతి మంచితనం, ఎవరు ఏమి అన్నా పట్టించుకోని తనమే ఆయనకు శాపంగా మారుతోందని ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్న ఆయన స్పందించరు. ఎవరి పాపాన వారే పోతారు అన్నట్లుగా ఉండే మెగాస్టార్ ధోరణి ఆయన ఫ్యాన్స్ ను బాధపెడుతోంది.
Advertisement
అయితే.. సోషల్ మీడియాలో ఎవరైనా మెగాస్టార్ కి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తే మాత్రం ఆయన ఫ్యాన్స్ గట్టిగానే ఇచ్చిపడేస్తూ ఉంటారు. కానీ, ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఆఖరున కూతుర్లపై ట్రోల్ చేస్తున్నా సరే మెగాస్టార్ స్పందించిన దాఖలాలు పెద్దగా లేవు. ఈ అతి మంచితనమే మెగాస్టార్ పాలిట శాపంగా మారుతోందని ఆయన ఫ్యాన్స్ వాపోతున్నారు.
బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ?