Home » టాలీవుడ్ ను పాటల తో దుమ్ములేపుతున్న తెలంగాణ సింగ‌ర్స్

టాలీవుడ్ ను పాటల తో దుమ్ములేపుతున్న తెలంగాణ సింగ‌ర్స్

by Bunty
Ad

గ‌తంలో టాలీవుడ్ లో పాటలు ఎక్కువ ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్స్ తో ప్ర‌త్యేకం గా పాడించే వారు. కొన్ని రోజుల త‌ర్వాత ఎలా ఉన్నా.. హీరో ల‌తో గానీ.. హీరోయిన్స్ ల‌తో గానీ పాడించే వారు. అయితే ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. ప్రేక్ష‌క‌లు మాస్ ను ఎక్కువ గా కోరుకోవ‌డం.. కొత్త ధ‌నాన్ని ఆశించ‌డం వ‌ల్ల కొత్త ట్రెండ్ వ‌స్తుంది. తెలంగాణ యాస లో మాస్ గా వ‌స్తున్న పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఉర్రుత‌లుగిస్తున్నాయి. దీంతో ప‌ల్లే లో అద్భుతం గా పాట‌లు పాడే ఆణిముత్యాల‌ను వెండి తెర ముందు కు తీసుకువ‌స్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో వ‌స్తున్న చాలా సినిమా ల్లో ఈ ట్రెండ్ క‌న‌ప‌డుతుంది.

Advertisement

ముఖ్యం గా ఫోక్ సింగ‌ర్ ల‌తో పాడిస్తున్న పాటలు ఎక్కువ గా వ‌స్తున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా ల నుంచి దీన్నే కోరుకుంటున్నారు. దీని వ‌ల్ల అద్భుతం గా టాలెంట్ ఉండి.. ప‌ల్లెటూల్లో మ‌గ్గి పోతున్నే సింగ‌ర్స్ వెండి తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. అంతే కాకుండా ఈ సింగ‌ర్స్ త‌మ కొత్త గొంతుల‌తో వెండి తెర‌కు కొత్త కాంతులు తెస్తున్నారు. అలా ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన కొన్ని పాటలు

Advertisement

ఇటీవ‌ల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అయిన భీమ్లా నాయ‌క్ అనే సినిమా టైటీల్ సాంగ్ విడుద‌ల అయింది. ఈ పాట లో 12 మెట్ల కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగుల‌య్య పాడిన పాట‌.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్ష‌కుల‌ను ఒక ఊపు ఊపెస్తుంది. “ఆడా గాదు.. ఈడా గాదు.. అంటూ సాగే ఈ పాట ఎన్నో రికార్డు ల‌ను సైతం కొల్లకొడుతుంది. కిన్నర మొగులయ్య త‌న కొత్త గొంతు తో వెండి తెర కు కొత్త కాంతులు తెచ్చాడు.

ఇదే బిమ్లా నాయక్ సినిమా లో ఇటీవ‌ల విడుద‌ల అయిన అడ‌వి త‌ల్లి పాట ఎంతో మందిని ఆక‌ట్టు కుంది. ఈ పాట ను తెలంగాణ లోని మంచిర్యాల కు చెందిన దుర్గ‌వ్వ పాడింది. ఈ పాట మెనియా కూడా ఇంకా త‌గ్గ‌లేదు.

తాజా గా ఐకాన్ స్టార్ పుష్ప అల్లు అర్జున్ హీరో గా వ‌స్తున్న పుష్ప సినిమా నుంచి స‌మంత నటించి స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల అయింది. ఊ అంటావా ? ఊఊ అంటావా ?? అంటూ సాగే ఈ పాట ను ఇంద్రావ‌తి చౌహాన్ అనే కొత్త సింగ‌ర్ పాడింది. త‌న కొత్త గొంతు తో వెండి తెర కొత్త కాంతులున ఇచ్చింది. ఇంద్రావతి చౌహాన్ పాపులర్ సింగర్ మంగ్లీ చెల్లెలు.

పుష్ప సినిమా లో నే ఇటీవ‌ల వ‌చ్చిన సామీ నా సామీ అనే పాట కూడా టాలీవుడ్ రు షేక్ చేస్తూనే ఉంది. ఈ పాట ను తెలంగాణ ప్ర‌ముఖ ఫోక్ సింగ‌ర్ మౌనిక యాద‌వ్ పాడింది. ఈమె గాత్రాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జలు ఎంతో ఆధ‌రిస్తున్నారు.

Visitors Are Also Reading