టాలీవుడ్ నటి సాయిపల్లవి ఇటీవల శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయిపల్లవి దేవదాసి పాత్రలో అద్బంతంగా నటించింది అంటూ ప్రశంసలు వస్తున్నాయి. అయితే కొందరు మాత్రం సాయిపల్లవిని సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేశారు.
Advertisement
దీనిపి తాజాగా తెలంగాణ గవర్నర్ తమిలిసై ట్విట్టర్ వేధికగా స్పందించారు. సాయిపల్లవిపై బాడీషేమింగ్ వార్తలు తనను బాధించాయని తమిలిసై అన్నారు. ఏ మహిళ కూడా బాడీషేమింగ్ కు గురికావద్దని వ్యాఖ్యానించారు. రంగు, రూపం, శారీరక వివక్ష తగదు అంటూ తమిళసై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శరీరపరంగా కామెంట్లు చేసేవారు ఉద్దేశ్యపూర్వకంగా మహిళలను అధైర్యపరుస్తారని తమిళిసై వ్యాఖ్యానించారు. మహిళలు అధైర్య పడకుండా తమ తమ రంగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
Advertisement
అంతే కాకుండా తాను కూడా బాడీషేమింగ్ ను ఎదుర్కున్నానని గవర్నర్ వెల్లడించారు. తనను చింపిరి జుట్టు అనేవారని కఠినమైన కృషి పట్టుదలతో ఆ వ్యాఖ్యలను ఎదుర్కొని ముందుకు సాగానని చెప్పారు. ఏదైనా అందమేనని అందుకే కాకిపిల్ల కాకికి ముద్దు అనే సామెత వచ్చిందని తమిళిసై వ్యాఖ్యానించారు.