టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి అభిమానులను సంపాదించుకున్న డైరెక్టర్ తేజ. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తేజ రాణించాడు. పలువురు స్టార్స్ తో సినిమాలు చేశాడు. అంతేకాకుండా చాలామంది నటీనటులను తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వాళ్లలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ హీరో గా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు.
Advertisement
మొదట ఈ సినిమాలో వేరే హీరోని అనుకోగా చివరికి ఉదయ్ కిరణ్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తేజ ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో నువ్వు నేను అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఉదయ్ కిరణ్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్ లు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే ఉదయ్ కిరణ్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు.
Advertisement
కానీ కొన్ని సినిమాల తర్వాత ఉదయ్ కిరణ్ కు ఫ్లాపులు మొదలయ్యాయి. వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో ఆఫర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. మళ్లీ అలాంటి సమయంలో తేజ ఉదయ్ కిరణ్ ను హీరోగా పెట్టి అవునన్నా కాదన్నా అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆసక్తికరమైన ఘటన జరిగిందని తేజ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చిత్రం, నువ్వు నేను సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ బిజీగా మారిపోయాడని చెప్పాడు. ఆ తర్వాత తాను చాలా సార్లు ఉదయ్ కిరణ్ కు ఫోన్ చేశానని కానీ తన ఫోన్ లేపలేదని చెప్పాడు. అయినప్పటికీ అవునన్నా కాదన్న సినిమాలో అవకాశం ఇచ్చానని చెప్పారు. అయితే ఆ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ రోజు ఉదయ్ కిరణ్ తన వద్దకు వచ్చి నేను తప్పు చేశాను.. మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాబట్టి క్షమాపణ కోరుతూ మీ కాళ్లు పట్టుకుంటాను అని చెప్పాడని అన్నాడు. దాంతో నువ్వు కాళ్లు పట్టుకుంటే ఆ తప్పును మర్చిపోయి మరో తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటా.. మనిద్దరం కలిసి ఈ సినిమా చేద్దాం. సూపర్ హిట్ కొడదాం…. అని చెప్పానని తేజ వెల్లడించారు. ఇక తేజ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతున్నాయి.