ఒకమనిషిని కోల్పోవడం ఎంత బాధగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటి ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటానని మాటిచ్చిన వ్యక్తి మధ్యలోనే కన్నుమూస్తే ఆ బాధ వర్ననాతీతం. ఇప్పుడు అలాంటి బాధనే అనుభవిస్తున్నారు తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి. తారకరత్న తను ప్రాణంగా ప్రేమించి అలేఖ్య రెడ్డిని ఇంట్లోవారిని సైతం ఎదిరించి వివాహం చేసుకున్నాడు. అందుకోసం తన కెరీర్ ను కూడా పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్లను సైతం దూరం చేసుకున్నాడు.
Advertisement
కానీ తనను నమ్మిన అలేఖ్యరెడ్డి చేయిపట్టుకుని ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవలే తారకరత్న నందమూరి కుటుంబానికి సైతం దగ్గరయ్యాడు. కానీ ఇంతలోనే తారకరత్న సంతోషాన్ని ఆ దేవుడు కూడా ఓర్వలేదేమో…ఈ లోకం నుండే తీసుకువెళ్లి ఆయన భార్యా పిల్లలను ఒంటరి చేశాడు. ఇక తనను ఎంతగానో ప్రేమించిన భర్త దూరం అవ్వడంతో అలేఖ్య రెడ్డి కన్నీరు మున్నీరవుతుంది.
Advertisement
ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిన తారకరత్నను ఇప్పటికీ తలుచుకుంటూ బాధపడుతోంది. అంతే కాకుండా రీసెంట్ గా తారకరత్న పుట్టిన రోజున భర్తను తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. కాగా తాజాగా తారకరత్న పెద్దకర్మ రోజున కూడా ఆయనను తలుచుకుని అలేఖ్యరెడ్డి ఎమోషనల్ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మన జీవితంలో ఎన్నో కష్టాలను చూశాం….ఒడిదుడుకులను అనుభవించాం.
ALSO READ :మోహన్ బాబు, విష్ణు లేకుండానే మంచు మనోజ్ పెళ్లి..?
జీవితంలో అత్యంత కష్టకాలాన్ని అనుభవించాం. మన కష్టాలు మీకు మాత్రమే తెలుసు…మంచి రోజుల కోసం మనం ఎదురు చూశాం. మనిద్దరం ఓ కుటుంబాన్ని సృష్టించుకున్నాం…నీ జీవితంలో నువ్వు పడిన కష్టాలు నీ ఒక్కడికే తెలుసు. నాలా నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు.. నీ గుండెల్లో ఎంతో బాధను తాచుకుని అపారమైన ప్రేమకు మాకు పంచావు. ప్రపంచం ఎన్ని అబద్దాలు చెప్పినా నువ్వు మా చుట్టే ఉన్నావు…నేను మరింత ఎదుగుతా నానా…మేము నిన్ను మిస్ అవుతున్నాం నానా…అంటూ అలేఖ్యరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
ALSO READ : సుడిగాలి సుధీర్- గెటప్ శ్రీను విడిపోవడానికి కారణం ఎవరో తెలుసా ?