నందమూరి తారకరత్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో సౌమ్యుడిగా పేరుపొందిన హీరో. అలాంటి ఈ హీరో చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం.
Advertisement
మరి తారకరత్న మరణానికి కారణం ఆ ఒక్క పొరపాటే. ఇదే ఆయన ప్రాణాల మీదికి తెచ్చిందట. ఆ పొరపాటు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. లోకేష్ మొదలు పెట్టిన యువ గళం పాదయాత్రకు వెళ్లేముందు ఉదయం తారక రత్న కాస్త అస్వస్థత కు ఫీలయ్యారని సమాచారం.
అయినా పట్టించుకోకుండా ఆయన పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లారు. ఈ తరుణంలోనే విపరీతమైన ఎండ వల్ల సొమ్మసిల్లి పడిపోవడంతో గుండెపోటు కూడా వచ్చింది. దీంతో ఆయనకు రక్తప్రసరణ ఆగిపోవడం, మెదడులో రక్తం గడ్డ కట్టింది. వైద్యులు ఎంత ప్రయత్నం చేసిన సమస్య క్లియర్ కాకపోవడంతో తారకరత్న చివరికి ప్రాణాలు విడిచారు. బ్రెయిన్ డ్యామేజ్ కావడం వల్ల కోమాలోకి వెళ్లిన తారకరత్న కోలుకోవడానికి వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.
Advertisement
షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని , ఆయనకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు మరింత ప్రభావం చూపాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లో ఆయన పుట్టినరోజు ఉండగా ఇంతలోనే ఆయన మరణించడం నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా చికిత్స తీసుకున్న తారకరత్న కోలుకొని వస్తారని అందరూ అనుకున్నారు. కానీ చివరికి ఆయన మరణించడం ప్రతి ఒక్కరిని కలచివేసింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన పార్టీవ దేహానికి సినీ,రాజకీయ ప్రముఖులంతా నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.
also read: