నందమూరి తారకరామారావు మనుమడు నందమూరి తారకరత్న మృతి చెందారు. గత 23 రోజులుగా ఆసుపత్రిలో… ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న… నందమూరి తారకరత్న ఇవాళ మృతి చెందారు. ఈ విషయాన్ని కాసేపటికి క్రితమే నారాయణ హృదయాలయ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. జనవరి 27వ తేదీన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
అయితే ఈ పాదయాత్రలో నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి చాలా ఉత్సాహంగా, నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో ముందుకు సాగారు తారకరత్న. అయితే పాదయాత్ర ప్రారంభమై ఒక గంట వ్యవధి సమయం కాగానే… తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు… వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో గత 23 రోజులుగా తారకరత్న ప్రాణాలతో పోరాడాడు. కానీ శివరాత్రి పర్వదినాన తారకరత్న…. నిండు ప్రాణాలను కోల్పోయాడు. ఇక ఈ విషయం తెలియడంతో, అటు నందమూరి కుటుంబం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో విషాదం నెలకొంది. ఇక ఈ విషయం తెలిసిన ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటులు, తెలుగు ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.