Home » తారకరత్నకు, ఎంపీ విజయసాయిరెడ్డికి ఇంత దగ్గరి రిలేషన్ ఉందా..?

తారకరత్నకు, ఎంపీ విజయసాయిరెడ్డికి ఇంత దగ్గరి రిలేషన్ ఉందా..?

by Sravanthi
Ad

నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రముఖుల్లో తారకరత్న కూడా ఒకరు. హీరోగా సక్సెస్ కాలేక, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామనే ఆలోచనతో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. అలా పాదయాత్ర కొనసాగుతూ ఉండగా తారక రత్న ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను హాస్పిటల్ తరలించారు. దీంతో ఆయనకు వైద్యులు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయన పరిస్థితి విషమంగా ఉందని మీడియాకు తెలియజేశారు.

Advertisement

Advertisement

అలాంటి తారకరత్నకు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి చాలా దగ్గర రిలేషన్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగన్ కు అత్యంత దగ్గర ఉండేటువంటి నేత విజయ్ సాయిరెడ్డికి తారక రత్న స్వయానా అల్లుడు వరస అవుతారు. వీరి రిలేషన్ కు ప్రధాన కారణం విజయ్ సాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తె అలేఖ్యను నందమూరి తారకరత్న పెళ్లి చేసుకున్నారు. దీనివల్లే విజయ్ సాయి రెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారు. అలేఖ్య ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.

తారకరత్న తీసిన నందీశ్వరుడు సినిమాకి కూడా ఈమె కాస్ట్యూమ్ డిజైనర్. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు హైదరాబాదులోని సంఘీ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లితో విజయసాయిరెడ్డి తారకరత్న మామా అల్లుళ్ల బంధం ఏర్పడిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

also read:

Visitors Are Also Reading