Home » తారకరత్న తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల ..! డాక్టర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం…..!

తారకరత్న తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల ..! డాక్టర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం…..!

by Bunty
Ad

సీనియర్ ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న… ఇటీవల గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జనవరి 27వ తేదీన పాదయాత్ర భారీ కార్యకర్తల మధ్య ప్రారంభించారు. ఈ తరుణంలోనే… నందమూరి తారకరత్నకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.

Advertisement

దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు అతని కుప్పంలోని ఆసుపత్రికి తరలించగా… వైద్యులు అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ గుండె ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం తారకరత్న నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ తరుణంలో తాజాగా వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.

Advertisement

ఈ సందర్భంగా వైద్యులు తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. అయితే తారకరత్నకు ఎక్మో సపోర్ట్ పెట్టలేదని తేల్చి చెప్పారు. సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన బులిటెన్ లో వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు. ఆస్పత్రి వద్ద ప్రజలు అలాగే అభిమానులు ప్రైవసీ కల్పించాలని… తారకరత్న చికిత్సకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. కాగా నిన్న తారకరత్నను చూసి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తారకరత్నను చూసిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లారు.

 

Read Also : Dasara : “దసరా” టీజర్ విడుదల.. ఊర మాస్ లుక్ లో రెచ్చిపోయిన నాని

Visitors Are Also Reading