Home » బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అవుతున్న సొట్ట బుగ్గల సుందరి…!

బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అవుతున్న సొట్ట బుగ్గల సుందరి…!

by AJAY
Published: Last Updated on
Ad

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ పన్ను. ఈ సినిమా తో తాప్సీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. సొట్ట బుగ్గల చిన్నది గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ ఆ తరవాత వరుస ఆఫర్ లు అందుకుంది. కానీ తాప్సీ కెరీర్ లో టాలీవుడ్ నుండి ఒక్క మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తప్ప మరో చెప్పుకోదగ్గ సినిమా లేదు.

Advertisement

కానీ బాలీవుడ్ లో మాత్రం తాప్సీ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. పింక్ సినిమా తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన నటన తో బాలీవుడ్ ను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్ లతో తాప్సీ బిజీగా ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే తాప్సీ కొంతకాలంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు క్రీకారుడు మారిథియాస్ బోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం తో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా దీనిపై ఈ జంట అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనుంది అని టాక్. ఇదిలా ఉంటే ఈ ముద్దు గుమ్మ మిషన్ ఇంపాజిబుల్ సినిమా తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Visitors Are Also Reading