టాంజానియాకు చెందిన ఈ అన్న, చెల్లెళ్లు లిప్ సింకింగ్ బాలీవుడ్ పాటలతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించారు. సినిమాలో నాటు నాటు పాటకు కూడా ఎన్టీఆర్, రామ్చరణ్ల్లాగే డ్యాన్స్ చేస్తూ అలరించాడు కిలిపాల్. అదేవిధంగా ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంతో పాటు చాలా బాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు లిప్ సింక్ చేస్తూ పాడటం, డ్యాన్స్ చేయడంతో కిలిపాల్, ఆయన చెల్లెలు నీమా పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను సంపాదించుకున్నారు.
Advertisement
ఆఫ్రికాలోని టాంజానియాకు చెందిన 26 ఏళ్ల కిలిపాల్ స్థానిక మసాయి తెగకు చెందిన యువకుడు. తూర్పున ఉన్న ప్వాని ప్రాంతంలో మిందు టులీని అనే ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంటాడు. వీరి గ్రామానికి కరెంట్ సరఫరా కూడా లేదు. ఫోన్ చార్జింగ్ చేసుకోవడానికి కూడా సమీపంలోని పట్టణం లుగోబాకు వెళ్లాల్సి ఉంటుంది.
Advertisement
టిక్ టాక్ వీడియోల చేయడం ద్వారా ఫేమస్ అయిన కిలి.. ఆ తరువాత బాలీవుడ్ పాటలకు తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమసయ్యాడు. సంగీతం విశ్వభాష అన్నీ జీవుల మధ్యాశ్రావ్యమైన బంధం. ఏ దేశంలో పుట్టామని, ఏ జాతికి చెందామని అన్న దానితో సంబంధం లేకుండా సంగీతం మనందరినీ కలుపుతుంది. దీనికి కిలిపాల్ చక్కటి ఉదాహరణ అని ప్రముఖ గాయకుడు జుబిన్ నౌటియాల్ తెలిపారు. పశువులను కాసి జీవించే వీరు ఇప్పుడు టాంజానియాలోనే కాదు.. భారత్‌లో కూడా ఫేమస్ అయ్యారు. అయితే భారతదేశంకు ప్రయాణించాలని పేర్కొంటున్నారు.