ఆఫ్గనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే మొదట తమ ఆధీనంలో ఉన్న ఆఫ్గనిస్థాన్ లో కూడా ప్రజలకు స్వేచ్చ ఉంటుందని స్త్రీలకు స్వేచ్చ ఉంటుందని తాలిబన్లు ప్రకటించారు. కానీ మొల్లి మొల్లిగా తమ నిజస్వరూపాన్ని తాలిబన్లు బయటపెడుతున్నారు. తాలిబన్ల విద్యను రద్దు చేసిన తాలిబన్లు ఇప్పుడు మరో కొత్త రూల్ ను తీసుకువచ్చారు. దేశంలోని ప్రభుత్వ ఆఫీసులలో పనిచేస్తున్న ఉద్యోగులు ఖచ్చితంగా గడ్డం పెంచుకోవాలనే నిబంధనను తీసుకువచ్చారు. ఒకవేల గడ్డం లేకపోతే ఆషీలకు రావద్దంటూ నిబంధనలు తీసుకువచ్చారు.
Advertisement
Advertisement
అంతే కాకుండా నిబంధనలు పాటించకుండా ఆఫీసులకు వస్తే ఉద్యోగం నుండి తొలగించేందుకు కూడా వెనకాడబోము అని పేర్కొన్నారు. తాలిబన్ల రాజ్యం వచ్చిన నాటి నుండి ఈ నిబంధన లేదు. అయితే తాజాగా ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లో తాలిబన్ అధికారులు కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆఫీసుల్లో చాలా మంది క్లీన్ షేవ్ లతో మరియు తమకు నచ్చిన విధంగా షేవ్ చేసుకుని కనిపించారు. దాంతో ఖచ్చితంగా ప్రతిఒక్కరూ గడ్డం పెంచుకుని ఆఫీసులకు రావాలంటూ నిబంధనలు తీసుకువచ్చారు. అంతే కాకుండా ఆఫీసులకు కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని చెప్పారు.