ఠాగూర్ చిరంజీవి కెరీర్ లో మైలురాయి. తమిళ రమణ సినిమాకు తెలుగు రిమేక్ గా వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలోని హాస్పిటల్ సీన్,పోలీస్ స్టేషన్ సీన్,కోర్ట్ సీన్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా కోర్ట్ సీన్ లో చిరంజీవి చెప్పే డైలాగ్స్ వినేటప్పుడు రోమాలు నిక్కబొడుస్తాయ్.! ఈ క్రెడిట్ ను చిరంజీవితో పాటు డైలాగ్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ కు ఇవ్వాల్సిందే! సుమారు 15 నిమిషాల పాటు సాగే ఈ సీన్ ను ఎప్పడు చూసినా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఠాగూర్ సినిమాను 1.5 కోట్లు పెట్టి తీస్తే….దాదాపు 28 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
Advertisement
కోర్ట్ లో జరిగిన సంభాషణ :
Advertisement
- సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేక ACFను స్థాపించాను, ఆసంస్థ చేసే పనులన్నింటికీ నేనే కర్త, కర్మ, క్రియ.
- ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ లంచం…అదే నా ఆవేదన., సగటు భారతీయుడి ఆవేదన.
- ఇండియా ఇస్ ది గ్రేటెస్ట్ కంట్రీ…ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం, 8 జపాన్ లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్ల జనాభాలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్ల జనాభాలో ఎంతమంది బిల్ గేట్స్ పుట్టాలి? కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం లంచం.
- మనదేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంఛం, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే భవిష్యత్ బిల్ గేట్స్ మనదేశం వదిలి పరాయి దేశానికి వలసపోతున్నారు. అక్కడ రాణిస్తున్నారు.
- చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మనదేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుంటూనే బ్రతుకుతున్నారు.
Also Read: Bangarraju Movie Dialogues Telugu
ఇలా ఈ సీన్ లో వచ్చే అన్ని డైలాగ్స్ లో ఫోర్స్ తో పాటు వాస్తవముంది. అందుకే జనాలు ఈ సీన్ ను అంతగా ఇష్టపడ్డారు.
Watch Video :