Home » ఈ లక్షణాలు ఉన్నాయా..? కచ్చితంగా మెగ్నీషియం లోపమే…!

ఈ లక్షణాలు ఉన్నాయా..? కచ్చితంగా మెగ్నీషియం లోపమే…!

by Sravya
Ad

చాలామంది వివిధ రకాల సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే కచ్చితంగా అది మెగ్నీషియం లోపం అని మీరు తెలుసుకోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలని కచ్చితంగా డైట్ లో తీసుకోవాలి. మనకి అవసరమైన వాటిల్లో మెగ్నీషియం కూడా ఒకటి. కండరాలు సరిగా పనిచేయాలన్న, జీవ రసాయన క్రియ సరిగా జరగాలన్న, నాడీ వ్యవస్థను మెరుగుపరచాలన్న మెగ్నీషియం చాలా ముఖ్యం. మెగ్నీషియం లోపం కనుక ఉన్నట్లయితే ఈ సంకేతాలు కనపడతాయి శరీరంలో కనుక మెగ్నీషియం తక్కువగా ఉన్నట్లయితే తరచు వికారంగా అనిపిస్తూ ఉంటుంది.

Advertisement

Advertisement

బాడీలో కావాల్సినంత మెగ్నీషియం లేకపోతే ఆకలి కూడా అస్సలు వేయదు. శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ తగ్గినట్లయితే, హృదయ స్పందనలు తేడాలు వస్తాయి. సరైన మోతాదులో మెగ్నీషియం లేకపోతే కంటి సమస్యలు కూడా వస్తాయి. కళ్ళ మంట, నొప్పులు రావడం వంటివి కనపడుతూ ఉంటాయి.

కండరాలు తిమ్మిర్లు ఎక్కడం కూడా మెగ్నీషియం లోపమని అర్థం చేసుకోవాలి. రక్తంలో మెగ్నీషియం కనుక లోపిస్తే నీరసం ఉంటుంది. అలసిపోయినట్లుగా ఉండడం బలహీనంగా ఉండడం వంటివి జరుగుతాయి. మెగ్నీషియం లోపం ఉన్నట్లయితే నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. చికాకుగా ఉండడం, తలనొప్పి, రక్తపోటు పెరగడం ఇవి కూడా మెగ్నీషియం లోపం కి కారణం.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading