ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన స్విగ్గీ, జోమాటోలు డిసెంబర్ 31 నైట్ దాదాపు 100 కోట్ల విలువైన ఫుడ్ డెలివరీ చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు యాప్స్ కలిపి నిమిషానికి 17 వేల ఆర్డర్లను తీసుకొని కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేశాయి.గతేడాది నిమిషానికి 5 వేల ఆర్డర్లు మాత్రమే వచ్చాయి.
Advertisement
Advertisement
ఇక ఎప్పటిలాగే ఈ యేడు కూడా బిర్యానీ టాప్ ఆర్డర్ లిస్ట్ లో నిలవగా., బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా, బటర్ చికెన్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సాధారణంగా ఒక డెలీవర్ బాయ్ రోజుకు 40 ఆర్డర్స్ డెలివరీ చేస్తాడు. డిసెంబర్ 31న ఒక్కొక్క డెలివరీ బాయ్ సఘటున 85 కు పైగా ఆర్డర్లను డెలివరీ చేశాడు. ఇందంతా ఒక్క హైద్రాబాద్ సంగతే!
31 కావడం, లేట్ నైట్ అయినా డెలివరీ ఇవ్వడంతో డెలివరీ బాయ్స్ కు టిప్స్ కూడా బాగా అందాయట! ఒక డెలివరీ బాయ్ తనకు టిప్స్ రూపంలోనే 5వేల రూపాయలు అందాయని చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఫుడ్ డెలివరీ చేస్తూనే న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పానని అన్నాడు.