వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత భారత్ తన తొలి సిరీస్ ను మళ్లీ ఆస్ట్రేలియాతోనే ఆడనుంది. ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న 5 టి20ల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ తొలిసారి భారతజట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది నుంచి టీ20లకు దూరంగా ఉన్న రోహిత్, విరాట్ కోహ్లీ ఈ సిరీస్ కు ఎంపికకాలేదు.
తొలి మూడు మ్యాచ్ లకు రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్ గాను….4, 5 టీ20లకు శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చి వైస్ కెప్టెన్ గాను వ్యవహరించనున్నారు. హైదరాబాది యువ బ్యాటర్ తిలక్ వర్మ సహ దాదాపుగా ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన జట్టే ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక అయింది. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ ఆడలేకపోయిన అక్షర్ పటేల్ ఈ సిరీస్ లో ఆడనుండగా…. ఇషాన్ కిషన్, ప్రసిద్ద్ కృష్ణలకు కూడా అవకాశం దక్కింది.
Advertisement
Advertisement
ముస్తక్ ఆలీ ట్రోఫీలో అదరగొట్టిన రియాన్ పరాగ్ తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ఇప్పటికే సంజు శాంసన్ కెరీర్ మసకబారుతుండగా వరల్డ్ కప్ తర్వాత కూడా తనకు అవకాశం దక్కకపోవడంతో ఇక అతనికి భారత్ జట్టులో ఆడడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈనెల 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్ జరగనుండగా తర్వాత వరుసగా తిరువనంతపురం గౌహతి రాయ్ పుర్ బెంగళూరులో మిగిలిన టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.