Home » నరేష్ పై కోపానికి వచ్చిన సూపర్ స్టార్..? పవిత్రతో బంధంపై తీవ్ర అసంతృప్తి..?

నరేష్ పై కోపానికి వచ్చిన సూపర్ స్టార్..? పవిత్రతో బంధంపై తీవ్ర అసంతృప్తి..?

by Sravanthi
Ad

గత కొన్ని వారాల నుండి ఎక్కడ చూసినా పవిత్ర లోకేష్, నరేష్ కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, సహజీవనం కూడా చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వచ్చి వీరి వార్తలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఈ తరుణంలోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈ మధ్యకాలంలో నరేష్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నాకు విడాకులు ఇవ్వకుండా నన్ను మోసం చేసి, బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసింది. తుపాకితో బెదిరించి విడాకులు ఇవ్వాలని నరేష్ బెదిరిస్తున్నారని కామెంట్స్ చేసింది.

Advertisement

అలాగే నరేష్ మరియు పవిత్ర లోకేష్ ఒక హోటల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న రమ్య అక్కడికి వెళ్లి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో వీరు సహ జీవనం చేస్తున్నారనే విషయం బయటపడింది. ఆ సమయంలో రమ్య రఘుపతి నరేష్ మరియు పవిత్ర లోకేష్ పై చెప్పుతో కొడతానని కోపానికి వచ్చింది. కానీ నరేష్ మాత్రం ఈలలు వేస్తూ,ఆమెను రెచ్చగొడుతూ వెళ్ళిపోయాడు. ఈ వివాదం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో పవిత్ర లోకేష్ చేస్తున్న రెండు సినిమాలు కూడా చేజారిపోయాయి అయితే ఈ విషయంపై నరేష్ తండ్రి కృష్ణ మాత్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇంటి పరువు తీస్తున్నారని ఆయన ఒక ఇంటర్వ్యూలో నరేష్ మ్యాటర్ గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. విడాకులు ఇవ్వడం బాగానే ఉంది కానీ, అలా హోటల్ గదులలో తిరుగుతూ, సహజీవనం చేయడం ఏంటి అని ఇంటి పరువును రోడ్డున పడేస్తున్నారని సూపర్ స్టార్ కృష్ణ నరేష్ పై కోపానికి వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా వీరిద్దరి వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మరి నరేష్ వ్యవహారం తిరిగి తిరిగి ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ నరేష్,పవిత్ర లోకేష్ నోరు విప్పితే కానీ ఈ విషయంపై క్లారిటీ వచ్చేట్లు లేదు.

also read:

Visitors Are Also Reading