ఒక్కొక్క సారి హీరోలకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఆ హీరో అభిమానులు వాటిని విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. రజనీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి చూపులోనే రజినీకాంత్ లత మాయలో పడిపోయారట. ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం నాటి రజనీకాంత్ లత వెడ్డింగ్ రిసెప్షన్ కార్డు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే అప్పుడే హీరోగా రజనీకాంత్ ఎదుగుతున్నారు.
Advertisement
యూత్‌లో ఫాలోయింగ్ బాగా పెరిగింది. లతా రంగాచారి డిగ్రీ చదువుతున్నారు. కాలేజీ మ్యాగజిన్ కోసం రజనీకాంత్ ని ఇంటర్వ్యూ చేయాలని ఆమె అనుకున్నారు. తెలిసిన వాళ్ళ ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ అయిపోయేలోగా రజనీకాంత్ తను చెప్పాలనుకుంది చెప్పేసారు. నువ్వంటే నాకు ఇష్టం నీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాము అని అన్నారట.
Advertisement
ఊహించని పరిణామానికి లతా షాక్ అయిపోయారు. ఇప్పుడు చెప్పలేను పెద్దల్ని అడిగి చెప్తాను అని ఆమె అన్నారు. లతా పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు 1981 ఫిబ్రవరి 24న వీళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లయిన రెండు వారాలకి చిత్ర ప్రముఖుల కోసం వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో చెన్నై నగరంలో లగ్జరీ హోటల్స్ లో ఒకటైన తాజ్ కోరమండల్ లో రజనీకాంత్ లతా వెడ్డింగ్ రిసెప్షన్ అయింది ఈ వేడుకకి సెలబ్రిటీలు వచ్చారు ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది. రజినీకాంత్ లత ఫోటోలతో పాటు హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు మాత్రమే అందులో వుంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!