ఫ్యామిలీ ట్రాజెడీ నుండి సినిమాలు కాస్త యాక్షన్ వైపుకు టర్న్ అవుతున్న సమయంలో సుమన్, భాను చందర్ ల సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. వీరి సినిమాల్లో యాక్షన్ సీన్స్ పీక్స్ లో ఉండడం ఒక కారణమైతే, వీళ్లు కరాటేలో బ్లాక్ బెల్ట్ కావడం చేత వీరి ఫైటింగ్ సీన్స్ లో ఉండే ఒరిజినాలిటీ మరో కారణం! ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో 9 సినిమాలు వస్తే 9 కి 9 సక్సెస్ అయ్యాయి.
Advertisement
1. ఇద్దరు కిలాడీలు
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమా ఇదే, ఈ సినిమాతో సుమన్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అప్పటికే భాను చందర్ కు తెలుగులో క్రేజ్ ఉంది. 1982లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిల్చింది.
2. తరంగిణి
1982 లోనే వీరి కాంబోలో వచ్చిన మరో సినిమా తరంగిని ఇది కూడా సూపర్ హిట్ ! దీంతో వీరి కాంబినేషన్ లో సినిమాలు తీయడం కోసం రైటర్లు కథలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
3. గడుసు పిండం
1984 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా ఎక్కువ రోజులు ఆడకపోయినా ఈ కాంబినేషన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
4. మెరుపు దాడి
1984 లో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రిలీజ్ అయిన మెరుపుదాడి హిట్ కొట్టింది. చిత్తూరులోని తలకోన అడవుల్లో షూటింగ్, సుమన్ భాను చందర్ ల ఫైటింగ్ సినిమాను హిట్ చేశాయి.
Advertisement
5. కుర్ర చేష్టలు
1984 లో సుమన్, భాను చందర్ కాంబోలో రిలీజ్ అయిన 3వ చిత్రం ఇది. సినిమా యావరేజ్ అయినప్పటికీ ఆ యేడాదంతా వీరిద్దరి పేర్లు మార్మోగాయి!
6. మొండి జగమొండి
ద బాటిల్ ఆఫ్ జైంట్స్ అంటూ సుమన్, భాను చందర్ ల పోస్టర్లతో సినిమాపై విపరీతమైన బజ్ ను క్రియేట్ చేశారు. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
7. సమాజంలో స్త్రీ
యాక్షన్ పాత్రలతో అలరించిన సుమన్, భాను చందర్ లు ఈ సినిమాలో యాక్టింగ్ తో కూడా అదరగొట్టారు. సెంటిమెంట్ సీన్లలో కట్టిపడేశారు. సినిమా యావరేజ్ గా ఆడినా మంచి సందేశాత్మక చిత్రంగా నిలిచింది.
8. డాకు
భారీ అంచనాలతో 1987లో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. టైటిల్ కు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సాగర్.
9. నక్షత్ర పోరాటం
1987 తర్వాత 1993 లో అంటే ఆరేళ్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన 9 వ చిత్రం నక్షత్ర పోరాటం. యాక్షన్ ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లో చూసి పండగ చేసుకున్నారు.