ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఒక టాప్ యాంకర్ గా ఎవరు ఉన్నారు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ. ఆమె తన యాంకరింగ్ తోనే ఎంతోమంది స్టార్ హీరోలను కూడా మెస్మరైజ్ చేసే టాలెంట్ ఉన్న యాంకర్ అని చెప్పవచ్చు. అయితే ఆమె యాంకరింగ్ లోనే కాకుండా నటించడంలో కూడా మంచి పేరు సంపాదించారు. ఏకంగా జయమ్మ పంచాయతీ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ సుమను కొంతవరకు నిరాశపరిచింది అని చెప్పవచ్చు.
Advertisement
డిజాస్టర్ అనే టాక్ ను మూటగట్టుకుంది అని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం బాగుంది పర్వాలేదు అని అంటున్నారు. అసలు విషయం ఏంటనేది కొద్ది రోజులు గడిస్తే కానీ అర్థం కాదు. అయితే యాంకర్ సుమ ఈ మూవీలో నటించడమే కాకుండా ఒక స్టార్ హీరో తీసుకునే విధముగా లాభాల్లో కూడా వాటాను తీసుకునేందుకు రెడీ అయింది. కొంత పారితోషికం తీసుకున్న సుమ సినిమాకు వచ్చే మొత్తంలో తనకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేసిందని తెలుస్తోంది.
Advertisement
అయితే ఇందులో ఆమె కొంత ఇచ్చిన మాకు భారీగా మిగులుతుందని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. కానీ ఇదంతా తారుమారైంది. సుమాకు దక్కింది పారితోషికం ఎంత అంటే 85 లక్షల రూపాయలు. అయితే ఈ సినిమాకు 5 కోట్ల వరకు వస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ మాత్రం కూడా రాకపోవడంతో ఆమెకు ఇచ్చే పారితోషికం కూడా నష్టపోయింది.