Home » వందల ఏళ్లుగా అలానే వున్న చైనా గోడ.. ఇన్నేళ్ళుగా ఎలా నిలబడింది..? శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే..?

వందల ఏళ్లుగా అలానే వున్న చైనా గోడ.. ఇన్నేళ్ళుగా ఎలా నిలబడింది..? శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే..?

by Sravya
Ad

చైనా గోడ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చైనా గోడ గురించి అందరూ చదువుకున్నాం ప్రపంచంలో ఏడు వింతల్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా ఒకటి. అత్యంత పొడవైన ఈ గోడ గురించి తెలియని వారు ఉండరు. ఈ గోడ మొత్తం పొడవు 8850 కిలోమీటర్లు. దీనిని క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో ప్రారంభించి 16వ శతాబ్దంలో ముగించారు. ఈ గోడ ఎంత పాతదో మనకి ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది.

ఈ గోడ శతాబ్దాలుగా నిలబడి ఉంది శాస్త్రవేత్తలు ఈ గోడ వేల సంవత్సరాలుగా ఇలా నిలబడి ఉండడానికి కారణాన్ని కనుగొన్నారు. తాజా నివేదిక ప్రకారం చైనా అమెరికా స్పెయిన్ల పరిశోధకులు ఒక అధ్యయనం ద్వారా కొన్ని విషయాలని వెల్లడించారు. లైకెన్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, నాచు అలానే చిన్న మొక్కలతో కూడిన బయోక్రస్ట్‌లు ఖనిజ ఉపరితలాలపై పెరుగుతూ ఉంటాయి.

Advertisement

Advertisement

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సుమారు 600 కిలోమీటర్ల మేర సర్వే చేసింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కి ఇవేమి ఎలాంటి ఇబ్బంది కలిగించవని తెలుస్తోంది. గోడలోని చాలా పాత విభాగాల్లో నేల మీద బయోక్రస్ట్ లు కనిపించాయని చెప్పారు. అయితే ఇవి పురాతన నిర్మాణాల సంరక్షణ లేదా క్షీణతకు దోహదం చేస్తాయి అని అధ్యయనాలు చెప్తున్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading