పోలీస్, కలెక్టర్, ముఖ్యమంత్రి ఇలా ఎవరు తయారు కావాలన్నా వాళ్లను తీర్చిదిద్దేది ఒక టీచర్ మాత్రమే. టీచర్ చదువు చెప్పడం వల్లే విద్యార్థి జీవితంలో పైకి వస్తారు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా స్కూల్లో నేర్చుకున్న పాఠాలను అనుభవాలుగా మార్చుకుని జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులను బుజ్జగిస్తూ పాఠాలు చెబితే మరికొందరు మాత్రం విసుక్కుంటారు.
Advertisement
అయితే టీనేజ్ లో ఉన్న విద్యార్థులను చిన్న మాట అనినా కూడా వాళ్ళు మనసులోకి తీసుకుంటారు. తాజాగా ఓ టీచర్ అలాంటి పనే చేసినట్టు కనిపిస్తోంది. విద్యార్థి చదవడం లేదనో మరి ఇతర కారణం వలనో….. నువ్వు పరీక్షల్లో పాస్ అవ్వలేవని విద్యార్థి ని చులకనగా చుసారేమో… దానిని ఆ విద్యార్థి చాలెంజ్ గా తీసుకుని చదువుకున్నాడు. పరీక్షల్లో పాస్ అయ్యాడు. అంతటితో ఆగకుండా తాను పాసైన విషయాన్ని టీచర్ కి చెబుతూ ఓ మెసేజ్ చేశాడు.
Advertisement
ఇక ఆ మెసేజ్ కు టీచర్ ఇచ్చిన రిప్లై షాకింగ్ గా ఉండటం వల్ల ఇద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్వీట్ ప్రకారంగా….. సదరు విద్యార్థి 12వ తరగతి పాస్ కాలేడని టీచర్ అంచనా వేసింది. కానీ విద్యార్థి మాత్రం పరీక్షల్లో పాసయ్యాడు. ఈ విషయాన్ని టీచర్ కు వాట్సప్ లో తెలియజేస్తూ….. ఇతరుల పట్ల దయ ఉండాలని గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీ సహాయం కోసం విద్యార్థులు వచ్చినప్పుడు. అంటూ మెసేజ్ లో పేర్కొన్నాడు.
హాయ్ మేడం నేను 2020 పదవ బ్యాచ్ విద్యార్థిని. నేను 12వ తరగతి పాస్ కాలేను అని చెప్పారు. నన్ను నిరుత్సాహపరిచేందుకు మీరు ప్రయత్నించారు. కానీ నేను ఇప్పుడు పాసయ్యాను. నాకు నచ్చిన యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఇది థాంక్యూ చెప్పడం కాదు…. నేను సాధించానని మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటూ పేర్కొన్నాడు. దానికి టీచర్…. నువ్వు పాస్ అవ్వడం వెనక నా భాగస్వామ్యం కూడా ఉందని ఇప్పటికీ అనుకుంటున్నాను అంటూ పేర్కొంది. దాంతో విద్యార్థి అవాక్కయ్యాడు. ప్రస్తుతం ఈ చాట్ వైరల్ అవుతోంది.