నాగార్జున మేనకోడలు సుప్రియ గురించి తెలియని వారు ఉండరు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఈ అమ్మడు కెరీర్ లో అంతగా సక్సెస్ కాలేకపోయింది. సుప్రియ తన జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సుప్రియ, సుమంత్ ఇద్దరూ అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమార్తె పిల్లలు. వీరి తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చాలా పెద్ద నిర్మాత. సుప్రియ తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
Advertisement
దీంతో సుప్రియ, సుమంత్ లను ఇద్దరినీ అక్కినేని నాగేశ్వరరావు దంపతులు పెంచి పెద్ద చేశారు. సినిమాలలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా అవకాశాలు సుప్రియకు రాలేదు. హీరోయిన్ కి ఉండాల్సిన అందం లేకపోవడంతో ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక సుప్రియ ‘ఇష్టం’ సినిమాలో హీరో అయినటువంటి చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా జన్మించింది. అయితే అతి కొద్ది రోజుల్లోనే చరణ్ కూడా చనిపోయాడు.
Advertisement
ఇక ఏం చేయాలో తెలియని సుప్రియ కొన్ని రోజులకి అన్నపూర్ణ స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. ఆమె బిహేవియర్ వల్ల స్టూడియోలో చాలామంది ఇబ్బందిపడేవారట. షూటింగ్ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రొడ్యూసర్లు, యాక్టర్లు అని పట్టించుకోకుండా చాలా మాటలు అనేదట. ఈమె అనే మాటల వల్ల చాలామంది షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారట. ఇక ఏది ఏమైనప్పటికి సుప్రియ తనకు వచ్చే జీతంతోనే తన కూతుర్ని చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంది.
ఇవి కూడా చదవండి
YS Bharti Reddy : భారతిరెడ్డి చేతికి గాయం.. కారణమేంటి.?
టాలీవుడ్ హీరోలకు భార్యలుగా ఇంతమంది రెడ్డి అమ్మాయిలా…!
అంత అందం ఉన్నా.. బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాలేకపోయారు ?