వివాదాస్పద నటి శ్రీరెడ్డి పరిచయం అక్క లేని పేరు. శ్రీరెడ్డి చెప్పుకోదగ్గ సినిమాలు చేయకపోయినా కాస్టింగ్ కౌచ్ అనే అంశంతో టాలీవుడ్ లో రచ్చ లేపింది. శ్రీ రెడ్డి ఏకంగా అర్ధ నగ్నంగా ఫిలిం ఛాంబర్ ముందు నిరసనకు దిగింది. దాంతో నేషనల్ మీడియా సైతం శ్రీరెడ్డి వైపు తిరిగింది. అలా కొద్ది రోజులపాటు శ్రీరెడ్డి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.
Advertisement
అయితే టాలీవుడ్ లో చాలామంది పెద్దలు శ్రీ రెడ్డి చేసిన పనిని తప్పు పట్టారు. అవకాశాల కోసం ఎవరు మోసపొమ్మన్నారని కామెంట్ చేశారు. అంతేకాకుండా శ్రీ రెడ్డిని మా సభ్యత్వం నుండి కూడా తొలగించిన సంగతి తెలిసిందే. దాంతో శ్రీరెడ్డి టాలీవుడ్ కు పూర్తిగా దూరమైపోయింది. ఇక హైదరాబాదు నుండి మకాం మార్చి చెన్నైకి షిఫ్ట్ అయింది. ప్రస్తుతం అక్కడే యూట్యూబ్ లో వంటల వీడియోలు ఇతర వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.
Advertisement
J
అంతేకాకుండా ఏపీ తెలంగాణ పాలిటిక్స్ పై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో ఇంతకాలం జగన్ కు సపోర్ట్ చేయగా ఇప్పుడు మాత్రం ప్లేట్ ఫి్రాయించింది. సీఎం జగన్ పాలనను సైతం విమర్శిస్తోంది. తనకు వైసిపి పాలన నచ్చడం లేదంటూ కామెంట్లు చేస్తోంది.
ఇది ఇలా ఉంటే శ్రీరెడ్డి రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కు హాజరైంది. యాంకర్ రోడ్లపై వెళుతున్న వ్యక్తులను ఆపి వాళ్ల ఫోన్ నెంబర్ తెలుసుకోవాలంటూ శ్రీరెడ్డికి ఓ ఛాలెంజ్ ఇచ్చాడు. దాంతో శ్రీ రెడ్డి ఛాలెంజ్ స్వీకరించి రోడ్లపై వెళుతున్న వారిని ఆపి ఫోన్ నెంబర్లను తీసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.