ఒకప్పుడు సినిమా అవకాశాలు సీరియల్ అవకాశాలు లేకపోతే సెలబ్రెటీలు పూర్తిగా స్క్రీన్ కు దూరమవ్వాల్సిందే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ పుణ్యమా అని ఫేడ్ అవుట్ అయినా….అవకాశాలు లేకపోయినా చేతి నిండా సంపాదిస్తున్నారు. అలా యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్న వారిలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా ఉన్నారు. నిజానికి శ్రీరెడ్డికి ముందు నుండి కూడా పెద్దగా ఆఫర్ లు వచ్చింది లేదు. ఏదో అడపాదడపా సినిమాలు చేసింది కానీ అవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో.
Advertisement
కానీ క్యాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి చేసిన రచ్చతో నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్పటి నుండి శ్రీరెడ్డిని టాలీవుడ్ వెలేసింది. దాంతో చెన్నైకి మకాం మార్చి అక్కడే వెబ్ సిరీస్ లు సినిమా అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు సినిమాలు రాజకీయాలు, సామాజిక అంశాలు ఇలా ఏ టాపిక్ నూ వదలకుండా తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. అందుకోసం శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ చానల్ ను కూడా ప్రారంభించింది.
Advertisement
ముఖ్యంగా ఏపీ రాజకీయాలపై ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తుంది. అంతే కాకుండా వంటలు చేయడం..తన బ్యూటీ సీక్రెట్ లు చెప్పడం తన బాత్రూం ఎలా ఉంది. అందులో ఏం ఉన్నాయి అనేది చూపించడం లాంటివి కూడా చేస్తోంది. ఇక తాజాగా తనకు ఉన్న ఆస్తుల గురించి శ్రీరెడ్డి ఓ వీడియో చేసింది. నా పుట్టింటి ఆస్తులు మీకు చూడాలని ఉందా అంటూ ఓ వీడియోను యూట్యూబ్ లో షేర్ చేసింది.
వీడియోలో తనకు తూర్పుగోదావరి జిల్లాలో తన అమ్మమ్మ తాతయ్య కు సంబంధించిన ఆస్తులను పుట్టింటివాళ్లు ఇచ్చారని చెప్పింది. తన పొలంలో నాటు వేస్తుండటం…పొలంలోని మునగ చెట్టును చూపించడం లాంటివి చేసింది. ఇక అదే ఊరిలో తనకు ఇల్లు కట్టుకోవాలని ఉందని కూడా చెప్పింది. ఇక ఈ వీడియోకు లక్షల్లో వ్యూవ్స్ వస్తుండగా భారీగా లైకులు కూడా వస్తున్నాయి.