సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల విడాకుల వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికే సమంత నాగ చైతన్య విడాకులను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా తమిళ స్టార్ హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త స్టార్ హీరో ధనుష్ తో విడిపోతున్నట్టు ప్రకటించింది. మరోవైపు చిరంజీవి కుమార్తె శ్రీజ కూడా తన భర్తతో విడాకులు తీసుకుపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ కు కొంతకాలంగా దూరంగా ఉంటుందని త్వరలోనే వీరిద్దరు కూడా విడాకులను ప్రకటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా తన భార్య తో విడిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీను వైట్ల తన భార్య రూప వైట్ల విడాకుల కోసం కోర్టులో అప్లై చేసినట్టు కూడా ఫిలింనగర్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
నాంపల్లి కోర్టులో విడాకులకు కోసం అప్లై చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా గత నాలుగు ఏళ్లుగా ఈ జంట విడిగా ఉంటున్నట్టు వారి స్నేహితులు, సన్నిహితులు చెప్పుకుంటున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల వల్ల విడివిడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇది ఇలా ఉండగా శ్రీనువైట్ల పలువురు స్టార్ హీరోలకు సూపర్ హిట్లను అందించారు. మహేష్ బాబుతో దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. అంతేకాకుండా ఢీ, రెడీ, బాద్షా, వెంకీ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తరికెక్కించారు. అయితే ఆగడు సినిమా తర్వాత మాత్రం శ్రీను వైట్ల కెరీర్ కాస్త డల్ అయింది. ఆ తర్వాత ఏ స్టార్ హీరోతోనూ సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇక ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ఢీ అంటే ఢీ అనే సినిమాను తెరికెక్కిస్తున్నారు.