Home » ఆ కోచ్ వల్ల ఏం కాదు అంటున్న శ్రీశాంత్…!

ఆ కోచ్ వల్ల ఏం కాదు అంటున్న శ్రీశాంత్…!

by Azhar
Ad

కరోనా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత అన్ని రంగాలు మళ్ళీ ఇప్పుడు పాత దారిలోకి వచ్చాయి. ఇక క్రీడా రంగం కూడా అందులో ఉంటుంది. అయితే కరోనా కారణంగా క్రికెట్ చాలా సిరీస్ లు జరగలేదు. కానీ ఈ కరోనా ప్రభావం తగ్గిన తర్వాత… జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లు వేగంగా జరుగుతున్నాయి. అసలు ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వకుండా వెంటవెంటనే సిరీస్ లు ప్రారంభం అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఆటగాళ్లు చాలా మెంటల్ ప్రెసర్ కు గురవుతున్నారు. ఇక గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో ఈ రకమైన ఒత్తిడి అనేహి మన భారత ఆటగాళ్లలో కనిపించింది.

Advertisement

అయితే ఇప్పుడు మళ్ళీ ప్రపంచ కప్ అనేది దగ్గర పడుతుంది. అందుకే ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తూనే.. సిరీస్ లను నిర్వహిస్తున్న బీసీసీఐ ఈసారి ఏ విధమైన ఛాన్స్ అనేది తీసుకోదలుచుకోలేదు. అందుకే భారత జట్టు యొక్క మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా ప్యాడీ అప్టన్‌ను మళ్ళీ నియమించింది. 2011 లో టీం ఇండియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన సమయంలో కూడా ప్యాడీ అప్టన్‌ ఇదే భాద్యతలు నిర్వహించాడు. ఇప్పుడు కూడా అతను రావడంతో జట్టుకు మంచి జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మాత్రం.. ప్యాడీ అప్టన్‌ వల్ల జట్టుకు ఏం లాభం ఉండదు అని పేర్కొన్నాడు.

Advertisement

తాజాగా కేరళలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. ప్యాడీ అప్టన్‌ వల్ల జట్టుకు ఏ మేలు జరగదు. అతనికి అంత సీన్ లేదు. అయితే ఈ ఏడాది మన జట్టు ప్రపంచ కప్ గెలిస్తే.. అది కేవలం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అలాగే ఆటగాళ్ల వల్లే అవుతుంది. ప్యాడీ అప్టన్‌ కు అద్భుతాలు అనేవి చేయడం తెలియదు. ఇక 2011 లో కూడా మేము ప్రపంచ కప్ గెలవడంలో అతను వంతు కేవలం ఒక్క శాతం మాత్రమే అని తెలిపాడు. కాకపోతే అతను మంచి యోగ టీచర్ అని.. ద్రావిడ్ భాయ్ ఈ విషయంలో అతడిని వాడుకోవాలని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ప్రపంచ కప్ గెలవలేదు…!

రోహిత్, ధావన్ మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

Visitors Are Also Reading