సినిమాలపై ఉన్న ప్రేమతో నందమూరి తారకరామారావు మారుమూల గ్రామం నుండి చెన్నైకి వచ్చారు. తన టాలెంట్ ద్వారా అతితక్కువ కాలంలోనే అవకాశాలను అందుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆయన సొంతం. చిన్న పెద్ద అని తేడా లేకుండా స్టార్ హీరో స్థాయిలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ముఖ్యంగా సీనియర్ నటీనటులను ఎన్టీఆర్ ఎంతగానో గౌరవించేవారు.
Advertisement
ఇక ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలో సీనియర్ నటుడు చిత్తూరు నాగయ్య గారితో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. చిత్తూరు నాగయ్య ఎన్టీఆర్,ఎన్ఆర్ తో పాటూ సీనియర్ హీరోల సినిమాలలో ముఖ్యపాత్రల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. నాగయ్య ఎన్టీఆర్ కు తండ్రిగా అనేక చిత్రాలలో నటించారు. మరోవైపు ఆయన దర్శకుడిగా సినిమాలు తీయడమే కాకుండా సంగీత దర్శకుడిగా సైతం పనిచేశారు.
Advertisement
ఎన్టీఆర్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల నాగయ్య ఎన్టీఆర్ మధ్యన విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్ నాగయ్యకు దత్త పుత్రుడు అయ్యారు. నాగయ్య దంపతులకు ఏవో కారణాల వల్ల సంతానం కలగలేదు. ఇక సినిమాల్లో మాత్రం నాగయ్య స్టార్ హీరోలకు తండ్రిగా నటించి ఆ ముచ్చట తీర్చుకున్నారు. అంతే కాకుండా ఎన్టీరామారావు సైతం నాగయ్యను నాన్న అని పిలిచేవారట.
అదే విధంగా ఏఎన్ఆర్ కూడా నాగయ్యను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారట. ఎన్టీఆర్ కుటుంబంలో ఏ వేడుక జరిగినా నాగయ్యను కచ్చితంగా ఆహ్వానించేవారట. అంతే కాదు ఎన్టీఆర్ కుటుంబంలో ఏ వేడుక జరిగినా ఆ వేడుకకు నాగయ్య పెద్దలా వ్యవహరించేవారు. నాగయ్య చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బుందులు ఎదుర్కొనగా ఎన్టీఆర్ దగ్గరుండి ఆయన భాగోగులు చూసకున్నారని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతుంటారు.