Home » ‘స్పైడర్ మ్యాన్’ మ్యాజిక్… 14 గంటల్లోనే రికార్డు స్థాయిలో టికెట్లు సోల్డ్ అవుట్

‘స్పైడర్ మ్యాన్’ మ్యాజిక్… 14 గంటల్లోనే రికార్డు స్థాయిలో టికెట్లు సోల్డ్ అవుట్

by Bunty
Ad

“స్పైడర్‌ మ్యాన్ : నో వే హోమ్” ముందస్తు బుకింగ్‌లో జోరును కొనసాగిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రం టిక్కెట్‌లు ప్రత్యక్షంగా అమ్మకానికి మొదలైన 14 గంటల్లోనే పివిఆర్ లో 1 లక్షకు పైగా టిక్కెట్‌ లను విక్రయించింది. ఈ టిక్కెట్ల మొత్తం విలువ రూ. 4 కోట్ల రేంజ్‌లో ఉంటుంది. అధిక టిక్కెట్ ధరలు, మహమ్మారి వరకు ఏదీ ‘స్పైడర్‌ మ్యాన్’ అభిమానులను తమ సూపర్ హీరో సినిమాని చూడకుండా ఆపడం లేదు. ఇంతకు ముందు భారీ టికెట్ బుకింగ్ ట్రాఫిక్ కారణంగా వివిధ టికెటింగ్ వెబ్‌ సైట్‌ లు వాటి సర్వర్ క్రాష్‌ను ఎదుర్కొన్నాయి.

Spider-Man: No Way Home' new poster unleashes the Multiverse; Tom Holland  starrer to release in India on Dec 17 | English Movie News - Times of India

Advertisement

Advertisement

జాతీయ చైన్‌లలో వారాంతంలో మొత్తం విక్రయం దాదాపు 1.70 లక్షల వరకు ఉంటుంది. “స్పైడర్‌ మ్యాన్ : నో వే హోమ్” ఇప్పటికే బాహుబలి 2, ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ వంటి సినిమాలతో వార్‌ తో పోటీ పడుతోంది. అడ్వాన్స్‌లను బట్టి చూస్తే ఈ చిత్రం రూ. 26.30 కోట్లతో సూర్యవంశీని అధిగమించి 2021లో అతిపెద్ద ఓపెనర్‌గా అవతరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ చాలా వరకు స్పాట్ బుకింగ్ అమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. ఈ సినిమా తొలిరోజే 20 కోట్ల రూపాయల మార్కును దాటడం ఖాయం. గురువారానికి 30 కోట్లతో ప్రారంభమవుతుందని ఇప్పటికే పరిశ్రమ, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ‘స్పైడర్ మ్యాన్’ ట్రేడ్ వర్గాల అంచనాలను తలక్రిందులు చేసే అవకాశం కూడా ఉంది.

Visitors Are Also Reading