అలనాటి హీరోయిన్లలో సౌందర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ ఒక్క ఆర్టికల్లో ఆమె గురించి వర్ణించడం సాధ్యం కాదు.. అంతటి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్.. అలాంటి హీరోయిన్ చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం బాధాకరం.. ఆమె మరణించి ఇన్ని సంవత్సరాలు అయినా అభిమానుల గుండెల్లో చిరస్మరణీయురాలుగా ఉందని చెప్పవచ్చు.. అలాంటి సౌందర్య కు ఒక చివరి కోరిక మాత్రం మిగిలి పోయిందట.
Advertisement
ప్రస్తుతం దాని గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.. మరి ఆ కోరిక ఏంటో మనం తెలుసుకుందాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగింది సౌందర్య. అప్పట్లో ఆమె సినిమాల్లో ఉందంటే తప్పనిసరిగా ఆ చిత్రం హిట్ అవుతుందనే భావన దర్శక నిర్మాతలకు ఉండేది. ఆ టైంలో ఈమె డేట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాతలు,దర్శకులు కూడా వెయిట్ చేసేవారంటే ఆమె క్రేజ్ ఏ విధంగా ఉండేదో మన అర్థం చేసుకోవచ్చు.
Advertisement
ఇండస్ట్రీలో ఇంతటి పేరు సంపాదించుకున్న సౌందర్య చివరికి ప్రమాదం ద్వారా మరణించడం చాలా బాధాకరం. కట్ చేస్తే.. సౌందర్య తండ్రి జ్యోతిష్కుడు.. ఆమె జీవితం అర్ధాంతరంగా ముగుస్తుందని ఆయన ఎప్పుడో చెప్పారట. కానీ సౌందర్య మాత్రం తండ్రి మాటలను కొట్టి పారేసేది. నేను 50 ఏళ్ల వరకు ఇండస్ట్రీలో ఏదో ఒక పాత్ర చేసుకుంటూ కొనసాగుతానని, నన్ను ఇండస్ట్రీ అసలు వదులుకోదని చెప్పిందట. కానీ సౌందర్య 50 ఏళ్ల వరకు నటిస్తాననే కోరిక తీరకుండానే మరణించడం అందరినీ కలచివేసింది.
also read: