టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లినటువంటి సౌందర్య ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె శారీరకంగా మన మధ్య లేనప్పటికీ తన సినిమాలతో ఇప్పటికీ మనతో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది.
Advertisement
ఈమె కన్నడ నటి అయినప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులను అలరించారు సౌందర్య. కేవలం కన్నడలోనే కాకుండా తమిళ, తెలుగు, మలయాళం భాషలలో కలిపి 100కు పైగా చిత్రాల్లో నటించింది. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన సౌందర్య “మనవరాలి పెళ్లి” అనే సినిమాతో తెలుగులో సినీ ప్రయాణం ప్రారంభించారు. అది తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయారు సౌందర్య. చిన్న వయసులోనే కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇక సౌందర్య “అంతఃపురం” సినిమాలో నటించినప్పుడు బిజీగా ఉండడం వల్ల ఒక యాక్షన్ సన్నివేశానికి రాలేకపోయారు.
Advertisement
ఇక ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూనే యాంకర్ గా చేస్తున్నటువంటి జోగినాయుడుగారు… కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక అలా అంతఃపురం సినిమా సమయంలో ఒక సీన్ లో కూడా అతను కనిపిస్తారు. దీంతో కృష్ణవంశీ గారు సౌందర్యకు డూప్ గా జోగి నాయుడుని పెట్టి ఆ యాక్షన్ సన్నివేశం తీయించారు. ఇలా సౌందర్య గారు వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయారు. అతి తక్కువ వయసులోనే విమానం కుప్పకూలి మరణించడం జరిగింది. తన మరణ వార్త విన్న సినీ ప్రేమికులు కన్నీరు మున్నీరయ్యారు.