గాడిద పాలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పాలను చిన్న పిల్లలకు తాగిస్తే చాలా మంచిదంటారు. అలాంటి గాడిదలను మనం పెంచితే ఎలా ఉంటుంది.. అని ఆలోచించినట్టున్నాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. చక్కని సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టి గాడిదల పెంపకంలోకి దిగాడు.మరీ ఆయనెవరు.. గాడిదలు పెంచడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం..? కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ తన జాబ్ ను వదిలేసి మంగళూరు లోనే గాడిదల పామును ప్రారంభించాడు.
Advertisement
అయితే ఆయన సాఫ్ట్వేర్ లో లక్షల రూపాయల ఉద్యోగం అయినా దాన్ని వదిలేసి 42 లక్షలు పెట్టుబడి పెట్టి 20 గాడిదలను పెంచుతున్నాడు. ఈ గాడిదల పెంపక శిక్షణ కేంద్రం ఇండియాలోనే మొదటిది కావడం చాలా విశేషం. ఆయన 2020 వరకు జాబ్ చేశానని, తర్వాత జాబ్ రిజైన్ చేసి గాడిదలను పెంచుతున్నానని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గాడిద పాలల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయని అందుకే వీటిని అందరికీ అందుబాటులో ఉంచాలన్నదే నా కల అని అన్నారు.
Advertisement
ప్రస్తుతం గాడిద జాతులు అంతరిస్తున్నాయి అని అందుకే నేను వీటి పెంపకాన్ని మొదలు పెట్టానని శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. గాడిద ఫారం పెడతానంటే మొదట్లో ఎవరు నమ్మలేదని, కానీ ప్రస్తుతం గాడిద పాల ప్యాకెట్లు అందుబాటులోకి తీసుకు వచ్చానని, 30 మిల్లీ లీటర్ల గాడిద పాల ప్యాకెట్స్ ను 150రూపాయలకు అమ్ముతామని వివరించారు. ఈ పాల ప్యాకెట్లను షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో కి తెచ్చామని అన్నారు. తనకు ఇప్పటి వరకు 17 లక్షల గాడిద పాల ఆర్డర్లు వచ్చాయని శ్రీనివాస్ గౌడ్ తెలియజేసారు.
also read;
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ గుర్తుందా…? ఇప్పుడు ఎక్కడ ఉంది..ఏం చేస్తుందంటే..!
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సాయిధరమ్ తేజ్ ..! అసలేమయ్యిందంటే…?