రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో స్కంద సినిమా వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్కంద సినిమాలో యాక్షన్ సీన్స్, తమన్ బిజిఎం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. కథ, కథనం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. అయితే సినిమా బయటికి వచ్చిన తర్వాత కొన్ని మిస్టేక్స్ అనేది ఆడియన్స్ కనిపెట్టి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు స్కంద పరిస్థితి కూడా అంతే.
స్కంద సినిమాలో ఒక బ్లండర్ మిస్టేక్ ఉంది ఈ మిస్టేక్ ని గమనించి ఓ లెక్కలో ఆడేసుకుంటున్నారు నెటిజెన్స్. ఈ సినిమాలో సీఎం రోల్ లో శరత్ లోహితస్వ, రామ్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ లో ఒక వ్యక్తిని రామ్ చంపేస్తాడు. రామ చేతిలో చనిపోయిన అతను శరత్ వెనుక ఉన్నట్లు తర్వాత షాట్లో కనపడడం జరిగింది. బోయపాటి శ్రీను కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే బాగుంటుందని ఆడియెన్స్ అంటున్నారు.
Advertisement
Advertisement
ఎడిటింగ్ లో పొరపాట్ల వలన ఈ విధంగా జరిగిందని ఇంకొందరు అభిప్రాయం. బోయపాటి శ్రీను మరి ఈ సీన్ పై ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఇది ఇలా ఉంటే స్కంద సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని బోయపాటి శ్రీను ప్రకటించారు మరి ఆ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనేది చూడాలి. బోయపాటి శ్రీను కొత్త ప్రాజెక్టుల ప్రకటన కోసం ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!