వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజమే ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు ఇలా అనేక కారణాలవల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సూత్రాలను పాటించడం ద్వారా భార్య భర్తలు తమ వైవివాహిక జీవితాన్ని సాఫీగా కొనసాగించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…..
Advertisement
భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఒకరితో మరొకరు మనసును విప్పి మాట్లాడుకోవడానికి కాస్త సమయం కేటాయించాలి. లేదంటే భోజనం చేసే సమయంలో అయినా ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. అంతేకాకుండా వారంలో ఒక్కసారి అయినా కలిసి సినిమాలకు లేదంటే కాలక్షేపం కోసమో వెళ్లడం లాంటివి చేయాలి.
భార్య అయినా భర్త అయినా తమకున్న ప్రేమను అప్పుడప్పుడు వ్యక్తపరచాలి. వీలైతే ఐ లవ్ యు చెబుతూ ఉండాలి. అలా చేయడంవల్ల తమను ఎక్కువగా ప్రేమిస్తున్నారని భావన భాగస్వామికి కలుగుతుంది.
Advertisement
ఇద్దరిలో ఎవరికి సమస్య వచ్చినా ఇది చాలా చిన్న సమస్య అంటూ మరొకరు సపోర్ట్ గా నిలవాలి. దాంతో తమకు ఎలాంటి సమస్య వచ్చినా తమ భాగస్వామి తోడుగా ఉన్నారనే ధైర్యం కలుగుతుంది. దాంతో ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢపడుతుంది.
జీవిత భాగస్వాములకు మీ భావాలను వ్యక్తపరచాలి. మీ మనసులో ఏముంది ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం ఇలా మీకు ఏమనిపించినా కూడా భాగస్వామితో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
శృంగా* విషయంలో కూడా ఒత్తిడి తీసుకురాకుండా భాగస్వామి మూడ్ ను తెలుసుకుని దానికి తగినట్టు గా ప్రవర్తించాలి. వాళ్ళు ఇబ్బంది పడేలా ఉంటే వారి ఇష్టాన్ని సైతం గౌరవించాలి.