సిరివెన్నెల గురించి ఎంత చెప్పినా తక్కువే… ఆయన మూడు వేలకు పైగా పాటలు రాశారు. ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. అయితే, 2015 నుంచి ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. 2015లో ఓ ఊపిరితిత్తికి క్యాన్సర్ సోకడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఆ తరువాత కొన్నాళ్లకు మరో ఊపిరిత్తికి కూడా వ్యాధి సోకింది.
Advertisement
Advertisement
అనారోగ్యంగా ఉన్నప్పటికీ సీతారామశాస్త్రి పాటలు రాస్తూనే ఉన్నారు అయితే, చివరిగా వాసు అనే సినిమా పాటలు రాసేందుకు రెండు లక్షలు తీసుకున్నారు. దర్శకుడు వెంకట్ సీతారామశాస్త్రికి ఫోన్ చేయగా,తన ఆరోగ్యం బాగాలేదని, ఊపిరితిత్తికి శస్త్రచికిత్స జరగాల్సి ఉందని, కోలుకున్నాక తిరిగి పాటలు రాస్తానని, రెండు తిరిగి ఇవ్వలేనని అన్నారట. సిరివెన్నెల ఫోన్ నుంచి మాట్లాడిన చివరి కాల్ ఇదే అని తెలియడంతో దర్శకుడు వెంకట్ ఆవేదన చెందాడు. అంత పెద్ద పాటల రచయిత ఫోన్లో తనతో చివరిగా మాట్లాడటం ఒకపక్క ఆనందంగా ఉందని, మరోపక్క విచారంగా ఉందని అంటున్నాడు దర్శకుడు వెంకట్. సీతారామశాస్త్రి తన రెండో సినిమా సిరివెన్నెలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. సిరివెన్నెలను ఇంటిపేరుగా మార్చుకున్నారు.