షణ్ముఖ్ అలియాస్ షన్ను కు తెలుగు రాష్ట్రాల్లో భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉన్నప్పటకి ట్రోఫిని గెలుచుకోలేకపోయాడు. షన్ను కప్పు గెలుచుకోలేకపోవడం వెనుక సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ పాత్ర ఉందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. రన్నరప్‌గా నిలిచిన షన్ను కప్ విషయాల్ని లైట్‌గా తీసుకున్నాడు. కప్ గెలవడం కంటే గేమ్ ఆడటమే తనకు ముఖ్యమని, కప్పు ఈరోజు కాకపోతే రేపు గెలుస్తామని అన్నారు. ఫైనల్స్ వరకు వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.
అయితే, సిరి హన్మంత్‌తో ఉన్న సంబంధం కారణంగానే షన్ను ట్రోఫిని కోల్పోయాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిరితో ఎక్కువగా ఎటాచ్ కావడం, హగ్స్ విషయంలో కూడా తల్లితో మాటలు పడ్డాడట షన్ను. బాధపడవద్దని సిరి స్వయంగా వచ్చి హగ్గులు ఇవ్వడంతో కాదనలేకపోయాడని, సిరి కారణంగానే షన్ను అందరి దృష్టిలో నెగెటివ్ అయ్యాడని వార్తలు వచ్చాయి. అందుకే షన్ను ఫ్యాన్స్ సిరిని ట్రోల్ చేశారట. ఓట్ల కోసమే సిరి షణ్ముఖ్‌తో ఉందని ట్రోల్స్ వచ్చాయి. గ్రాండ్ ఫినాలేకు రెండు రోజుల ముందు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ షన్నును తీవ్రంగా నిందించాడు. సిరి హౌస్ లో లేకుండా ఉంటే షన్ను పిచ్చివాడు అయ్యేవాడని నిందించాడు. శ్రీహాన్ నిందించడం వలనే షన్ను గేమ్‌లో ఒడిపోయాడని వార్తలు వస్తున్నాయి. అదును చూసి సిరి బాయ్ ఫ్రెండ్ దెబ్బకొట్టాడని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
Advertisement